iDreamPost

చంద్రబాబుకు జగన్‌ ప్రభుత్వం చాలా సాయం చేసింది!

చంద్రబాబుకు జగన్‌ ప్రభుత్వం చాలా సాయం చేసింది!

స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడుకి సకల సైకర్యాలు కల్పించినట్లు సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చంద్రబాబుపై ఏ విధమైన కక్ష్యపూరిత ధోరణి లేకుండా చట్టం ప్రకారమే నడుచుకుంటోందని సీఐడీ లాయర్ తెలిపారు. విద్యార్థులకు నైపుణ్యాల పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడిన వ్యక్తి చంద్రబాబు అయినప్పటికి ఆయన కోరిన విధంగానే ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతివ్వాలని ఏసీబీ కోర్టులో వేసిన పిటీషన్ కు తాము అడ్డు చెప్పలేదని సీఐడీ లాయర్ వెల్లడించారు.

తనను హౌస్ అరెస్టు చేయాలంటూ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు, దానికి గల కారణాలను కోర్టుకు విన్నవించారు. జైల్లో బాబుకు రక్షణ లేదంటూ, అక్కడ కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని హౌస్ అరెస్టు చేయాలని వాదనలు వినిపించారు. మరో వైపు సీఐడీ తరఫున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాబును హౌస్ అరెస్టు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయంటూ, జైళ్లోనే పూర్తి రక్షణ ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న కోర్టు హౌస్ కస్టడీ పిటిషన్ పై తీర్పును రేపటికి వాయిదా వేసింది.

ఈ క్రమంలో సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బాబుకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా జగన్ ప్రభుత్వం సాయం అందించిందని తెలిపారు. ప్రభుత్వం పెద్దమనసుతో చంద్రబాబుకు అవసరమైన మందులు, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని సీఐడీ లాయర్ తెలిపారు. రాజమండ్రి జైలులో బాబుకు భారీ భద్రత కల్పించాం. అతడికి కేటాయించిన వార్డులో వేరే వ్యక్తులు అక్కడ ఉండకుండా ఏర్పాట్లు చేసి వసతి కల్పించాం. చంద్రబాబు అనుమతి లేకుండా ఆయన బ్లాక్ లోకి ఎవరూ ప్రవేశించలేరు. జైల్లో బాబుకు రక్షణలేదనడం హాస్యాస్పదం అని పొన్నవోలు తెలిపారు. 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో, వైద్య సదుపాయానికి డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి