iDreamPost
android-app
ios-app

చంద్రబాబు అరెస్టును పండగ చేసుకున్న వ్యక్తి.. 101 కొబ్బరి కాయలు కొట్టి..

చంద్రబాబు అరెస్టును పండగ చేసుకున్న వ్యక్తి.. 101 కొబ్బరి కాయలు కొట్టి..

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న చంద్రబాబుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా సొంత పార్టీ నాయకులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర్ రావు చంద్రబాబు నాయుడు అరెస్టైన సందర్భంగా స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా సామాన్య ప్రజలు కూడా పండగ జరుపుకుంటున్నారు. బాబు పాలనలో విసుగు చెంది, నష్టపోయిన పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన పాపాలకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు, దాని ఫలితమే జైల్లో చిప్ప కూడు తింటున్నాడంటూ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి చంద్రబాబు అరెస్టు అయినందుకు ఏకంగా 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

తాను మేధావిని అని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే బాబు అధికార దాహంతో ఎంతో మందిని పీడించాడు. తనకు అవసరమున్నతం సేపు వాడుకుని ఆ తర్వాత వారి జీవితాలను నాశనం చేసి, వారి భవిష్యత్ ను అంధకారం చేసిన ఘనత బాబుకే దక్కుతుంది. అధికారం చేజిక్కుంచుకోవడం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి, తన మాయమాటలతో నాయకులను తనవైపు తిప్పుకుని పార్టీని తన హస్తగతం చేసుకున్న ఘటనలు ప్రజలు ఇప్పటికీ మరిచి పోలేరు. మానసిక క్షోభకు గురిచేసి ఎన్టీఆర్ చావుకు కారకుడైన బాబుకు తగిన శాస్తి జరిగిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఏపీకి చెందిన ఓ వ్యక్తి పండుగ చేసుకున్నట్లుగా సమాచారం. బాబును అరెస్ట్ చేయడంతో 101 కొబ్బరి కాయలు కొట్టి దేవాలయంలో మొక్కును తీర్చుకుని సంబరాలు చేసుకున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి గతంలోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే 101 కొబ్బరి కాయలు కొడతానని మొక్కు కున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు బాబు అరెస్టుతో ఆ వ్యక్తి కోరిక నెరవేరడంతో ఇలా మొక్కు తీర్చుకున్నట్లు తెలిసింది. ఇలా సామాన్య ప్రజలు బాబు అరెస్టును సంబరాలు చేసకుంటున్న తీరును చూస్తుంటే బాబు తన పాలనలో ఎంతటి అరాచకాలకు పాల్పడి ఉంటాడో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş