iDreamPost

హర్ష సాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడా?

హర్ష సాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడా?

హర్ష సాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివాళ్లు ఉండరేమో. యూట్యూబ్ ఫాలో అయ్యే ప్రతిఒక్కరికి హర్షసాయి పేరు కచ్చితంగా తెలుస్తుంది. లేని వాళ్లకు సేవ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటాడు. అలా తన వీడియోల ద్వారా ఇంకొంత ఇన్ స్పైర్ కావాలని కోరుకుంటూ ఉండాడు. ఫ్రీ పెట్రోల్ బంక్ తో హర్ష సాయి పేరు బాగా మారు మోగింది. అలాగే తింటానికి తిండిలేని వాళ్లని ఫల్కనుమా ప్యాలెస్ కు తీసుకెళ్లి వారికి భోజనం పెట్టిస్తాడు ఆ వీడియో, బార్బర్ ను మిలియనీర్ ని చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హర్షసాయి రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మనిషి ఎవరైనా ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయరు అనే ఒక థియరీ చూపిస్తూ హర్షసాయిపై ట్రోలింగ్, విమర్శలు చేస్తున్నారు. గోరంత సహాయం చేసి కొండంత ఆదాయం తాను సొంతం చేసుకుంటున్నాడు అంటూ చెబుతుంటారు. వారికి సహాయం చేస్తున్న పేరుతో హర్షసాయి లక్షలు సంపాదిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇంకొంత మంది హర్షసాయి రాజకీయాల్లోకి వస్తున్నాడని.. అందుకే ఇలాంటి వీడియోలు చేసి ప్రజల్లో ఆదరణ పొందుతున్నాడు అంటు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి అన్ని పుకార్లు, కామెంట్స్, విమర్శలకు హర్షసాయి తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అసలు తాను ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే విషయాలను చెప్పుకొచ్చాడు.

“మనం సహాయం చేసినప్పుడు ఎదుటివాళ్ల ముఖంలో ఒక చిన్న స్మైల్ వస్తుంది. దానికోసమే నేను ఇలా చేస్తున్నాను. నేను ఈ వీడియోలు అన్నీ నన్ను చూసి ఇంకో నలుగురు ఇన్ స్పైర్ కావాలని చేస్తున్నాను. నేను నా సొంత డబ్బును మాత్రమే వీడియోలు తీసేందుకు వాడతాను. ఒకరికి సహాయం చేస్తే.. ఆ వీడియోకి కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుని ఇంకొంకరికి సహాయం చేసేందుకు వాడతాను. అలా ఇదంతా ఒక కంటిన్యూ ప్రాసెస్ లాంటిది. ఫ్రీ పెట్రోల బంక్, 5 స్టార్ హోటల్ అన్నీ ఒక రోజు కాన్సెప్ట్స్ మాత్రమే. నిజంగానే నాకు 5 స్టార్ హోటల్లో భోజనం పెట్టించే స్థాయికి ఎదిగితే సంతోషంగా 365 రోజులు ఫ్రీగా 5 స్టార్ హోటల్ లో భోజనం పెట్టిస్తాను” అంటూ హర్షసాయి చెప్పుకొచ్చాడు.

ఇంక హర్షసాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనే వచ్చే వార్తలకు జర్నలిస్ట్ జాఫర్ క్లారిటీ ఇచ్చారు. హర్షసాయి ఎలాంటి రాజకీయ పార్టీలో చేరడం లేదని.. ఏ రాజకీయ నాయకులతో టచ్ లో లేడని చెప్పారు. ఇవన్నీ కావాలని చేస్తున్న ప్రచారాలు మాత్రమే అని చెప్పారు. అంతేకాకుండా మొదటిసారి ఇంటర్వ్యూ చేసిన సమయంలో హర్షసాయి చెప్పిన మాటలను గుర్తు చేశారు. తాను ఎలాంటి రాజకీయ అజెండాతో ఈ పనులు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ లో కూడా హర్షసాయి ఏ రాజకీయ పార్టీతో, రాజకీయ నాయకుడితో కలిసి ప్రయాణం చేయరని చెప్పు. హర్షసాయితో క్లియర్ గా మాట్లాడిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి