iDreamPost

OTT Suggestion: నాన్న విలువ తెలియచెప్పే సినిమా! OTTలో ప్రతి కొడుకు తప్పక చూడాలి!

  • Published Apr 29, 2024 | 1:14 PMUpdated Apr 29, 2024 | 1:14 PM

సినిమా అంటే అందరు కలిసి కూర్చుని హాయిగా చూసేలా ఉండాలి. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు అరుదుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేస్తే మాత్రం ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్ అయినట్లే. అందులోను ఈ సినిమా యూట్యూబ్ లో అంబాటులో ఉంది.

సినిమా అంటే అందరు కలిసి కూర్చుని హాయిగా చూసేలా ఉండాలి. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు అరుదుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేస్తే మాత్రం ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్ అయినట్లే. అందులోను ఈ సినిమా యూట్యూబ్ లో అంబాటులో ఉంది.

  • Published Apr 29, 2024 | 1:14 PMUpdated Apr 29, 2024 | 1:14 PM
OTT Suggestion: నాన్న విలువ తెలియచెప్పే సినిమా! OTTలో ప్రతి కొడుకు  తప్పక చూడాలి!

మలయాళీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల మదిని దోచేస్తున్న సమయంలో.. ఈ మధ్య కాలంలో అందరు మలయాళీ సినిమాలను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు. మలయాళీ సినిమాలు ఎం మ్యాజిక్ చేస్తున్నాయో తెలియదు కానీ.. చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాలకు అడిక్ట్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే ఏకంగా థియేటర్స్ లోనే.. మలయాళీ సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తే.. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టాయన్న సంగతి తెలిసిందే. దీనితో ఓటీటీ లో కూడా ఇలాంటి మూవీస్ కోసం తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అయితే, ప్రేమలు సినిమాలో హీరో నస్లీన్ నటించిన .. ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ.. అది కూడా తెలుగులో అందుబాటులో ఉందని తెలుసా.. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ప్రేమలు ఫేమ్ నస్లీన్ నటించిన ఈ సినిమా పేరు “హోమ్”. 2021 లో మలయాళంలో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఫ్యామిలీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అందులోను ఈ సినిమాను ఫ్రీ గా యూట్యూబ్ లో చూసేయొచ్చు. దాదాపు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నిటికి కూడా సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిందే. మరి ఈ సినిమా ఫ్రీ గా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది కాబట్టి. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం.. వెంటనే చూసేయండి. నిజానికి ఈ సినిమాలో ట్విస్ట్ లు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ లేకపోయినా సరే.. చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూడొచ్చు. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమా 8.8 రేటింగ్ దక్కించుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ సినిమా అవుతుంది.

అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి.. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. ఈ సినిమా ఒక అమాయకమైన తండ్రి, టెక్నాలజీకి అలవాటు పడి తండ్రిని సరిగా పట్టించుకోని కొడుకుల మధ్యన సాగే కథ. ఈ సినిమాలో హీరో ఒక రైటర్ తాను తీసిన మొదటి కథతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. రెండవ కథను ఇంట్లోనే రాయాలని నిర్ణయం తీసుకుని.. ఇంటికి చేరుకుంటాడు. చాలా కాలం తర్వాత కన్న కొడుకు ఇంటికి రావడంతో.. ఆ తండ్రి అందరికి ఎంతో సంతోషంగా తన కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటాడు, కానీ తన కొడుకు మాత్రం తనని ఏ మాత్రం పట్టించుకోకుండా.. మొబైల్ ఫోన్స్ కు అడిక్ట్ అయిపోతాడు. దీనితో ఆ తండ్రి మనస్సు నొచ్చుకుని.. తానూ కూడా ఈ కొత్త టెక్నలాజిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత అయినా తన కొడుకులు, ఆ తండ్రిని అర్ధం చేసుకుంటారా లేదా ! తనని పెంచి పోషించిన తండ్రి ఎంత గొప్పవాడో ఎలా తెలుసుకుంటాడు ! అనేది చూడాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి