iDreamPost

కోర్టులో ఊరట! ఇకపై జాక్వెలిన్ వాటి గురించి చెప్పక్కర్లేదు!

  • Author ajaykrishna Updated - 03:27 PM, Thu - 17 August 23
  • Author ajaykrishna Updated - 03:27 PM, Thu - 17 August 23
కోర్టులో ఊరట! ఇకపై జాక్వెలిన్ వాటి గురించి చెప్పక్కర్లేదు!

కొన్నాళ్ళుగా చీటర్ సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించి రూ. మనీ ల్యాండరింగ్ కేసు.. ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు రూ. 200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో బలంగా వినిపించాయి. ముఖ్యంగా సుకేష్ తో బాగా సన్నిహితంగా ఉండి.. అతని వద్ద ఖరీదైన గిఫ్టులు కూడా తీసుకుందంటూ శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నేండేజ్ పేరు మార్మోగిపోయింది. ఈ కేసులో జాక్వెలిన్ పేరు లింక్ అయినప్పటి నుండి ఆమె ప్రతిసారి హెడ్ లైన్స్ లో మెయిన్ టార్గెట్ అవుతూ వచ్చింది. జాక్వెలిన్ తో పాటు నోరా ఫతేహి పేరు కూడా ఈ కేసులో కొన్నాళ్ళు వైరల్ అయ్యింది.

ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) సుకేష్ కేసులో జాక్వెలిన్ ని ప్రధానంగా అనుమానించింది. గతేడాది నవంబర్ లో కోర్టు కొన్ని షరతులు విధించి.. జాక్వెలిన్ కి బెయిల్ మంజూరు చేసింది. కానీ.. విదేశాలకు వెళ్లడానికి క‌నీసం మూడు రోజుల ముందైనా తన ట్రావెలింగ్ ప్లాన్ ని EDకి అందించాల్సిన వస్తుంది. అయితే.. తాను నటి, మోడల్ కాబట్టి.. తరచుగా షూట్స్ కోసమైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయమై పలుమార్లు జాక్వెలిన్.. షార్ట్ నోటీసులో ప్రయాణించాల్సి వస్తోందని ED విధించిన నిబంధనలను బ్రేక్ చేసే అవసరం వస్తుందని కోర్టును కోరింది. ఇలాంటి నిబంధనల వలన తన వర్క్ కోల్పోయే అవకాశం ఉందని.. ఎలాగైనా వెసులుబాటు కల్పించాలని రిక్వెస్ట్ చేసింది.

ఇన్నాళ్లకు ఢిల్లీ పాటియాలా కోర్టు.. జాక్వెలిన్ పిటిషన్ పై విచారణ చేసింది. ఇదివరకటిలా ఎటైనా వెళ్ళేటప్పుడు ముందస్తు అనుమతులు అడిగే అవసరం లేదని కోర్టు రిలీవింగ్ ఆర్డర్ పాస్ చేసింది కోర్టు. దీంతో జాక్వెలిన్ కి మంచి ఊరట కలిగించిందని చెప్పవచ్చు. ఈ ఆర్డర్‌ ను పాస్ చేసేటప్పుడు ఇటీవలి ప్రవర్తనను కోర్టు పరిగణనలోకి తీసుకుందట. అంటే.. ఇకపై జాక్వెలిన్ ప్రపంచంలో ఏ దేశానికైనా చెప్పకుండా వెళ్లొచ్చని అనుమతి లభించింది అన్నమాట. అయితే.. సుకేష్ తో ఫ్రెండ్ షిప్ చేయడం.. అతని వద్ద గిఫ్టులు తీసుకోవడమే జాక్వెలిన్ చేసిన మెయిన్ మిస్టేక్ అని ఈడి తెలిపింది. మరి జాక్వెలిన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి