iDreamPost
android-app
ios-app

Jabardasth Pavithra: జబర్దస్త్‌ పవిత్రకు ప్రమాదం.. తుక్కుతుక్కయిన కారు.. ఎమోషనల్‌ పోస్ట్‌

  • Published May 19, 2024 | 12:48 PM Updated Updated May 19, 2024 | 3:20 PM

టాలీవుడ్‌ బుల్లితెరను ప్రమాదాలు వీడటం లేదు. ఈ వారంలో ఇద్దరు టీవీ ప్రముఖులు మృతి చెందగా.. తాజాగా జబర్దస్త్‌ పవిత కారుకు యాక్సిడెంట్‌ అయ్యింది. ఆ వివరాలు..

టాలీవుడ్‌ బుల్లితెరను ప్రమాదాలు వీడటం లేదు. ఈ వారంలో ఇద్దరు టీవీ ప్రముఖులు మృతి చెందగా.. తాజాగా జబర్దస్త్‌ పవిత కారుకు యాక్సిడెంట్‌ అయ్యింది. ఆ వివరాలు..

  • Published May 19, 2024 | 12:48 PMUpdated May 19, 2024 | 3:20 PM
Jabardasth Pavithra: జబర్దస్త్‌ పవిత్రకు ప్రమాదం.. తుక్కుతుక్కయిన కారు.. ఎమోషనల్‌ పోస్ట్‌

ఈమధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు వరుసగా ప్రమాదాలకు గురి కావడం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. గత ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో త్రినయని ఫేమ్‌ పవిత్ర జయరామ్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక.. ప్రియుడు చంద్రకాంత్‌ శుక్రవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర లేని లోకంలో ఉండలేనంటూ తను వెళ్లిపోయాడు. ఈ షాక్‌ నుంచి కోలుకోకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్‌ కంటెస్టెంట్‌ పవిత్ర కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఆమె ప్రయాణిస్తున్న కారు తుక్కుతుక్కు అయ్యింది. ప్రమాదం గురించి పవిత్ర చేసిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

గత ఆదివారం పవిత్ర జయరామ్‌ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగడం.. ఆమె మృతి చెందడం చోటు చేసుకుంది. ఇక ఈ ఆదివారం జబర్దస్త్‌ కంటెస్టెంట్‌ పవిత్ర కారు యాక్సిడెంట్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు పవిత్రకు ఏం కాలేదు. కానీ ఈ ప్రమాదంలో ఆమె ఎంతో ముచ్చటపడి కొనుకున్న కారు తుక్కుతుక్కయ్యింది. కొన్ని నెలల క్రితమే ఈ కారు కొనుగోలు చేసింది పవిత్ర. ఈ ప్రమాదం గురించి పవిత్ర ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. అదృష్టం బాగుండి తాము ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పవిత్ర తన పిన్ని, ఆమె పిల్లలతో కలిసి సొంత ఊరు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌ అయ్యింది. నెల్లూరు జిల్లా ఉప్పలపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయి.. పవిత్ర ప్రయాణం చేస్తున్న కారు గోతిలోకి దూసుకుపోయింది. దీని గురించి పవిత్ర చేసిన పోస్ట్‌లో ఇలా చెప్పుకొచ్చింది.

‘‘ఓటేయడం కోసం ఊరెళ్లాం. మా పిన్ని, ఆమె ఇద్దరు పిల్లలు మొదటి సారి నా కారు ఎక్కారు. ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తోన్న వెహికల్‌ డ్రైవర్‌ కన్ఫ్యూజ్‌ చేయడం వల్లే యాక్సిడెంట్‌ జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. అదే కాస్త ఊరట కలిగించే అంశం. సీటు బెల్ట్‌ పెట్టుకోవడం వల్ల నాకు కూడా దెబ్బలేం తగల్లేదు’’ అని చెప్పుకొచ్చింది.

‘‘ఈ భయానక ఘటన నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. రోజంతా దీని గురించే ఆలోచిస్తున్నాను. అయితే మాకారుకు యాక్సిడెంట్‌ అయినప్పుడు.. అందరూ నన్ను గుర్తు పట్టారు.. కానీ ఒక్కరు కూడా మాకు సాయం చేయడానికి రాలేదు. వీడియోలు తీశారు. అది చూసి నాకు చాలా బాధేసింది అని చెబుతూ పవిత్ర ఎమోషనల్‌ అయ్యింది. ఇక సాధారణ నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవిత్ర.. జబర్దస్త్‌లో అవకాశం దక్కించుకుంది. తన కామెడీ టైమింగ్‌తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా షోలు చేస్తూ వస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది పవిత్ర. ఆమెకు యూట్యూబ్‌ చానెల్‌ కూడా ఉంది. వీడియోలు అప్లోడ్‌ చేస్తుంటుంది.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinMeritbet güncel girişJojobet GirişcasibomCasibom GirişHoliganbetgalabetHoliganbetMarsbahis GirişCasibomJojobetHoliganbetJojobetHoliganbet