iDreamPost
android-app
ios-app

Kevvu Karthik: ఐదేళ్లుగా క్యాన్సర్ తో పోరాటం..అమ్మ కష్టం చెప్తూ.. కెవ్వు కార్తీక్ ఎమెషనల్!

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది గుర్తింపు సంపాదించారు. అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ ఒకరు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కార్తీక్ అలరిస్తుంటారు. అలాంటి కార్తీక్ తాజాగా ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు.

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది గుర్తింపు సంపాదించారు. అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ ఒకరు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కార్తీక్ అలరిస్తుంటారు. అలాంటి కార్తీక్ తాజాగా ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు.

Kevvu Karthik: ఐదేళ్లుగా క్యాన్సర్ తో పోరాటం..అమ్మ కష్టం చెప్తూ.. కెవ్వు కార్తీక్ ఎమెషనల్!

ఎంతో మంది బుల్లితెర, వెండితెరపై చిరునవ్వులు చిందిస్తూ ప్రేక్షులను అలరిస్తుంటారు. తమ నటనతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా అందరినీ నవ్వించే కమెడియన్ల జీవితంలో కూడా ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి.  నవ్వు ముసుగు వేసుకుని మనసులో మాత్రం అంతులేని బాధలతో పోరాటం చేస్తూ ఉంటారు. తమ బాధలను బయటకు కనిపించకుండా కామెడీ చేయడం వారికి అలవాటు అయిపోయింది. అలాంటి నటీనటులు ఎందరో ఉన్నారు. ఇప్పటికే పలువురు నటుల లైఫ్ లో జరిగిన కష్టాల మనం చూశాం. తాజాగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఐదేళ్లుగా తన తల్లి పడుతున్న ఆవేదనను నాలుగు మాటల్లో కళ్లకు కట్టినట్లు రాసుకొచ్చాడు.

తెలుగు బుల్లితెర  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే షోల్లో జబర్దస్త్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు బుల్లితెరకు పరిచయం అయ్యారు. అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ ఒకరు. ఆయన తనదైన పంచులతో, కామెడీతో ప్రేక్షుకులను అలరిస్తున్నారు. బుల్లితెరపై వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా కార్తీక్ మెరిశారు. పలు సినిమాల్లో నటించారు. ఇలా తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీక్ జీవితంలో మాత్రం చాలా కష్టాలు పడ్డారు. ముఖ్యంగా ఆయన తల్లి ఆరోగ్యం విషయంలో కార్తీక్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. తాజాగా తన తల్లి గురించి ప్రస్తావిస్తూ ఓ  వీడియోను కార్తీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్టులో కెవ్వు కార్తీక్ ఇలా రాసుకొచ్చారు. అమ్మా..నువ్వు క్యాన్సర్ తో చేస్తున్న అలుపెరగని పోరాటానికి సరిగ్గా ఐదేళ్లు పూర్తైంది. ఎన్నో సర్జరీలు, మరెన్నో కిమొథెరపీలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, అలానే భరించలేని బాధలు, అర్ధంకాని అగాధంలో పడ్డ భవిష్యత్తు, చీకట్లో గమ్యం తెలియని ప్రయాణం, అన్నింటికీ ఒక్కటే సమాధానం నీ ఆత్మస్థైర్యం. నువ్వు ఒక గొప్ప అలుపెరుగని పోరాట యోధురాలివి.. అమ్మా అంటూ కెవ్వు కార్తీక్ రాసుకొచ్చారు.  ఇదే సమయంలో తన తల్లికి చికిత్స అందించిన వైద్యులకు కూడా కార్తీక్ కృతజ్ఞతలు తెలిపారు.

తన అమ్మకి చికిత్స చేసిన, చేస్తున్న డాక్టర్లు అందరికి పాదాభివందనం అంటూ చెప్పుకొచ్చారు. అమ్మ కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ  కృతజ్ఞతలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు కార్తిక్. ఈ పోస్టులో కార్తీక్..తన తల్లితో పాటు ఉన్న పోటోలను షేర్ చేశాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఎమోషనలయ్యారు. తన తల్లిపై కార్తీక్ కి ఉన్న ప్రేమకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీ అమ్మగారు త్వరగా కోలుకుంటారని, మీరంతా సంతోషంగా గడుపుతారంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. గతంలో ముక్కు అవినాష్ కూడా తన తల్లి  గురించి అలానే పోస్టు చేశారు. ఆస్పత్రిలో ఉన్న తన తల్లితో అవినాష్ మాట్లాడిన వీడియోలు కూడా మనం చూశాం. తాజాగా కెవ్వు కార్తీ..తల్లి ఆరోగ్యం గురించి చెబుతూ ఆయన ఎమోషనలయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Kevvu Kartheek (@kevvukartheek)

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş