iDreamPost

ఇషాన్, అయ్యర్​పై బీసీసీఐ వేటు.. మళ్లీ భారత్​కు ఆడాలంటే అదొక్కటే గతి!

  • Published Feb 28, 2024 | 10:05 PMUpdated Feb 28, 2024 | 10:13 PM

యంగ్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​కు బీసీసీఐ షాకిచ్చింది. వాళ్లిద్దరిపై వేటు వేసి గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో ఈ ఇద్దరు స్టార్ల కెరీర్ డేంజర్​లో పడింది. వీళ్లు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే అదొక్కటే గతి.

యంగ్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​కు బీసీసీఐ షాకిచ్చింది. వాళ్లిద్దరిపై వేటు వేసి గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో ఈ ఇద్దరు స్టార్ల కెరీర్ డేంజర్​లో పడింది. వీళ్లు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే అదొక్కటే గతి.

  • Published Feb 28, 2024 | 10:05 PMUpdated Feb 28, 2024 | 10:13 PM
ఇషాన్, అయ్యర్​పై బీసీసీఐ వేటు.. మళ్లీ భారత్​కు ఆడాలంటే అదొక్కటే గతి!

భారత క్రికెట్ బోర్డు అన్నంత పని చేసింది. తమ మాట వినకుండా, ఆదేశాలను బేఖాతరు చేసిన యంగ్ బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్​పై బీసీసీఐ వేటు వేసింది. 2023-24 సీజన్​కు సీనియర్ క్రికెటర్ల యానువల్ కాంట్రాక్ట్స్​ను ప్రకటించింది బోర్డు. ఊహించినట్లే ఇషాన్, అయ్యర్​ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది. సౌతాఫ్రికా టూర్ మధ్యలోనే వచ్చేసిన కిషన్ తర్వాత జరిగిన ఏ సిరీస్​లోనూ ఆడలేదు. ఐపీఎల్ కోసం హార్దిక్ పాండ్యాతో కలసి ప్రాక్టీస్ చేయడంతో బోర్డు కన్నెర్ర చేసింది. రంజీ ట్రోఫీలో జార్ఖండ్​కు ఆడాలని చెప్పినా ఆడలేదు. అస్సాం, బరోడాతో మ్యాచుల్లో ముంబై తరఫున ఆడాలని కోరితే శ్రేయస్ అయ్యార్ దూరంగా ఉన్నాడు. గాయం సాకుతో ఎన్​సీఏకు వెళ్లిపోయాడు. దీంతో వీళ్లిద్దరిపై బోర్డు వేటు వేసింది. అయితే కాంట్రాక్ట్స్ కోల్పోయిన ఇషాన్, అయ్యర్​ తిరిగి టీమిండియాలోకి రావాలంటే అదొక్కటే గతి. వాళ్ల రీఎంట్రీకి ఉన్న మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బీసీసీఐ కాంట్రాక్ట్స్ కోల్పోయినప్పటికీ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కాంపిటీటివ్ క్రికెట్ ఆడొచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​తో పాటు డొమెస్టిక్ టోర్నమెంట్స్​లో పాల్గొనొచ్చు. ఐపీఎల్​తో పాటు రంజీ ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపితే తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. రింకూ సింగ్, తిలక్ వర్మ గతేడాదే టీమిండియాలోకి వచ్చారు. వాళ్లిద్దరూ బీసీసీఐ కాంట్రాక్ట్ లేకపోయినా భారత జట్టుకు ఆడారు. చాలా మంది విషయంలో ఇలాగే జరిగింది. బాగా పెర్ఫార్మ్ చేసి, టీమ్​లో సెటిలయ్యాక కాంట్రాక్ట్స్ దక్కించుకున్న వాళ్ల లిస్టు పెద్దగానే ఉంది. ఇషాన్, అయ్యర్ డొమెస్టిక్​ లెవల్లో దుమ్మురేపితే భారత జట్టుకు వాళ్లను సెలక్ట్ చేస్తారు. సీనియర్ టీమ్ తరఫున ఆడే మ్యాచులకు వాళ్లకు ఫీజుల రూపంలో డబ్బు సమకూరుతుంది. ప్రతి మ్యాచ్​కు ఇంత అని మ్యాచ్ ఫీజు చెల్లిస్తారు. కానీ బోర్డు నుంచి జీతం మాత్రం రాదు. అలాగే సిరీస్​లకు టీమ్​ను సెలక్ట్ చేసే సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లకు ఇచ్చినంత ప్రిఫరెన్స్ వీళ్లిద్దరికీ ఉండదు.

కాంట్రాక్ట్ కలిగిన క్రికెటర్లకు ట్రైనింగ్ ఫెసిలిటీస్, మెడికల్ సపోర్ట్, ట్రావెల్ అలోవెన్స్​ను బీసీసీఐనే భరిస్తుంది. ఇవన్నీ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​కు వర్తించవు. ఇక, వీళ్లిద్దరి రీఎంట్రీ అంత ఈజీ కాదు. డొమెస్టిక్ క్రికెట్​లో ఒక రేంజ్​లో అదరగొట్టాలి. ఫామ్, ఫిట్​నెస్​ను నిరూపించుకోవాలి. టీమ్​లో చోటు రాకపోయినా ఓపిగ్గా ఉండాలి. బోర్డుతో పాటు టీమ్ మేనేజ్​మెంట్ గురించి ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడినా భారత జట్టు ద్వారాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఐపీఎల్​తో పాటు డొమెస్టిక్ టోర్నమెంట్స్​లో అదరగొట్టినా వాళ్లను జట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లతో పాటు బీసీసీఐ పెద్దలు, టీమ్ మేనేజ్​మెంట్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సమ్మతి ఉండాలి. వాళ్లంతా ఓకే అంటేనే రీఎంట్రీ సాధ్యమవుతుంది. దీంతో ఇప్పట్లో ఈ ఇద్దరు క్రికెటర్లు కమ్​బ్యాక్ ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. మరి.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రీఎంట్రీ గురించి మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బ్రేకింగ్‌.. BCCI సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ ప్రకటన.. A+ గ్రేడ్‌లో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి