iDreamPost

వీడియో: పాక్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ను సిరాజ్‌ కావాలనే కొట్టాడా? అసలు నిజం ఏంటి?

  • Published Jun 10, 2024 | 12:07 PMUpdated Jun 10, 2024 | 12:07 PM

Mohammed Siraj, Mohammad Rizwan, IND vs PAK, T20 World Cup 2024: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఉండాల్సిన మసాలా నిన్నటి మ్యాచ్‌లో కాస్త కనిపించింది. అయితే.. ఇందులో సిరాజ్‌ తప్పుందని కొంతమంది అంటున్నారు. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

Mohammed Siraj, Mohammad Rizwan, IND vs PAK, T20 World Cup 2024: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఉండాల్సిన మసాలా నిన్నటి మ్యాచ్‌లో కాస్త కనిపించింది. అయితే.. ఇందులో సిరాజ్‌ తప్పుందని కొంతమంది అంటున్నారు. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 10, 2024 | 12:07 PMUpdated Jun 10, 2024 | 12:07 PM
వీడియో: పాక్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ను సిరాజ్‌ కావాలనే కొట్టాడా? అసలు నిజం ఏంటి?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో పాక్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది రోహిత్‌ సేన. పేరుకు టీ20 క్రికెట్‌ అయినా.. ఈ మ్యాచ్‌లో అంతా బౌలర్ల రాజ్యం నడించింది. ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో రెండు టీమ్స్‌లోని బ్యాటర్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 119 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయితే.. పాక్‌ అంతకంటే ఘోరంగా కేవలం 113 పరుగులు మాత్రమే చేసి 6 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌ సంగతి అటుంచితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌.. పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ను కొట్టాడు. ఈ ఘటన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ చివరి బాల్‌ సందర్భంగా చోటు చేసుకుంది. సిరాజ్‌ వేసిన బాల్‌ను రిజ్వాన్‌ ముందుకి ఆడాడు.. అది సిరాజ్‌ చేతికి చిక్కింది. బాల్‌ను కొట్టిన తర్వాత రిజ్వాన్‌ కాస్త ముందుకి వచ్చాడు. అది గమనించిన సిరాజ్‌.. బాల్‌ అందుకుని.. వేగంగా వికెట్ల వైపు త్రో వేశాడు. అది కాస్త రిజ్వాన్‌ చేయికి బలంగా తాకింది. ఆ నొప్పితో రిజ్వాన్‌ చాలా సేపు అల్లాడిపోయాడు. అప్పటికే సిరాజ్‌, రిజ్వాన్‌కు సారీ కూడా చెప్పాడు. కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం రిజ్వాన్‌ను సిరాజ్‌ కావాలనే కొట్టాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే ఇలా ఘటనలు కామనే అయినా.. ఇక్కడ సిరాజ్‌ కావాలనే కొట్టాడు అనే చాలా మంది ఆరోపిస్తున్నారు. అయితే.. అందులో నిజం లేదని తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి రనౌట్‌ను సిరాజ్‌ చేశాడు. శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో బ్యాటర్‌ షాట్‌ ఆడి ముందుకు వచ్చిన తర్వాత.. పర్ఫెక్ట్‌ త్రోతో సిరాజ్‌ వికెట్‌ తీశాడు. ఇప్పుడు కూడా అలానే చేయబోయడు కానీ, అక్కడు రిజ్వాన్‌ చేయి అడ్డువచ్చింది. ఆ తొందరలో రిజ్వాన్‌కు బాల్‌ తాకింది తప్పితే.. ఇందులో కావాలని కొట్టింది ఏం లేదు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి చాలా పొదుపుగా బౌలంగ్‌ చేసి.. టీమిండియా విజయానికి ఎంతో దోహదపడ్డాడు. మరి రిజ్వాన్‌-సిరాజ్‌ మధ్య జరిగిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి