iDreamPost

IPL ఓ సర్కస్.. చూడ్డానికి బాగుంటుంది.. స్టార్క్ ఊహించని కామెంట్స్

ఐపీఎల్ పై ఊహించని షాకింగ్ కామెంట్స్ చేశాడు లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడు మిచెల్ స్టార్క్. ఐపీఎల్ ను సర్కస్ తో పోల్చాడు. మరి స్టార్క్ అలా అనడానికి కారణం ఏంటి?

ఐపీఎల్ పై ఊహించని షాకింగ్ కామెంట్స్ చేశాడు లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడు మిచెల్ స్టార్క్. ఐపీఎల్ ను సర్కస్ తో పోల్చాడు. మరి స్టార్క్ అలా అనడానికి కారణం ఏంటి?

IPL ఓ సర్కస్.. చూడ్డానికి బాగుంటుంది.. స్టార్క్ ఊహించని కామెంట్స్

IPL.. క్రికెట్ లవర్స్ ను ఊర్రూతలూగించడానికి సిద్ధమైంది. 16 సీజన్లను దిగ్విజయంగా ముగించుకుని 17వ సీజన్ లోకి మరికొద్ది రోజుల్లో అడుగుపెట్టబోతోంది. ఇందుకోసం అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ ను మెుదలుపెట్టి.. తమ తమ ప్లాన్స్ తో సిద్దంగా ఉన్నాయి. కొందరు ఆటగాళ్లు గాయాలతో దూరమవుతుండగా, మరికొందరికి ఇదే లక్కీ ఛాన్స్ కు ఈ మెగాటోర్నీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పై ఊహించని షాకింగ్ కామెంట్స్ చేశాడు లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడు మిచెల్ స్టార్క్. ఐపీఎల్ ను సర్కస్ తో పోల్చాడు. మరి స్టార్క్ అలా అనడానికి కారణం ఏంటి?

మిచెల్ స్టార్క్.. 8 ఏళ్ల పాటు ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కళ్లు చెదిరే ధరకు అతడిని కొనుగోలు చేసి అందరికి షాకిచ్చింది కోల్ కత్తా నైట్ రైడర్స్. స్టార్క్ ను ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్. ఈ ధర అతడికి చాలా ఎక్కువ అని అప్పట్లోనే కొందరు విమర్శించారు. కానీ వాటిని కేకేఆర్ పట్టించుకోలేదు. తాజాగా కోల్ కత్తా టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్ సైతం స్టార్క్ విషయంలో మాకు ఎలాంటి భయాలు లేవని, అతడి ఆటతీరుపై పూర్తి నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

Mitchel starc about IPL

ఈ నేపథ్యంలో ఐపీఎల్ పై ఊహించని కామెంట్స్ చేశాడు మిచెల్ స్టార్క్. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. తాజాగా ఐపీఎల్ పై స్పందించాడు ఈ ఆసీస్ ప్లేయర్. “8 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ ల్లోకి అడుగుపెట్టబోతున్నాను. నా పాత మిత్రులను కలుసుకోబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో ఆడిన ఎన్నో అనుభూతులు గుర్తుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు కొత్త టీమ్ తో జతకట్టబోతున్నాను. అయితే 2018లోనే నేను కేకేఆర్ కు ఆడాల్సి ఉంది. కానీ గాయంతో దూరం కావాల్సి వచ్చింది. నా దృష్టిలో ఐపీఎల్ ఓ సర్కస్ లాంటిది.. అది అందరికి అత్యుత్తమ వినోదాన్ని అందిస్తుంది” అంటూ చివర్లో షాకింగ్ కామెంట్స్ చేశాడు స్టార్క్.

ఈ వ్యాఖ్యలపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం అతడు వినోదాన్ని అందిస్తుందన్న ఉద్దేశంలోనే ఈ కామెంట్స్ చేశాడని చెప్పుకొస్తున్నారు. కాగా.. 2014, 2015 ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఆసీస్ స్టార్ పేసర్. మరి స్టార్క్ ఐపీఎల్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024.. 3 కోట్ల ఆటగాడు దూరం.. సర్ఫరాజ్ కు లక్కీ ఛాన్స్! ఆ జట్టు తరఫున ఎంట్రీ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి