iDreamPost

IPL 2024.. 3 కోట్ల ఆటగాడు దూరం.. సర్ఫరాజ్ కు లక్కీ ఛాన్స్! ఆ జట్టు తరఫున ఎంట్రీ?

గాయం కారణంగా రూ. 3 కోట్ల ఆటగాడు దూరం కావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ కు ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం దొరికినట్లు సమాచారం. మరి గాయపడిన ఆటగాడు ఎవరు? సర్ఫరాజ్ ఏ టీమ్ తరఫున ఆడనున్నాడు? పూర్తి వివరాలు..

గాయం కారణంగా రూ. 3 కోట్ల ఆటగాడు దూరం కావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ కు ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం దొరికినట్లు సమాచారం. మరి గాయపడిన ఆటగాడు ఎవరు? సర్ఫరాజ్ ఏ టీమ్ తరఫున ఆడనున్నాడు? పూర్తి వివరాలు..

IPL 2024.. 3 కోట్ల ఆటగాడు దూరం.. సర్ఫరాజ్ కు లక్కీ ఛాన్స్! ఆ జట్టు తరఫున ఎంట్రీ?

సర్ఫరాజ్ ఖాన్.. భారత క్రికెట్ లో అభినవ బ్రాడ్ మన్ గా గుర్తింపు పొందాడు. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరదపారించి.. సెలెక్టర్లకు సవాల్ విసిరి మరీ టీమిండియాలోకి అడుగుపెట్టాడు ఈ యువ బ్యాటర్. ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిచ్చరపిడుక్కి ఐపీఎల్ మినీ వేలంలో చుక్కెదురైంది. సత్తాచాటగల ప్లేయరే అయినప్పటికీ.. మినీ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ ప్రస్తుతం సర్పరాజ్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. రూ. 3 కోట్ల ఆటగాడు గాయపడటంతో అతడు ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ దక్కబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి గాయాలు. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరం అయ్యారు. తాజాగా గత సీజన్ రన్నరప్ టీమ్ గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్ తగిలింది. రూ. 3.60 కోట్లకు కొనుగోలు చేసిన రాబిన్ మింజ్ కు ఇటీవల యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం నుంచి కోలుకుని ఐపీఎల్ ఆడతాడని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. రాబిన్ మింజ్ ఈ సీజన్ కు దూరమైయ్యే అవకాశాలు ఉన్నాయని గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా పీటీఐకి తెలిపినట్లు సమాచారం.

ఇప్పటికే క్యాష్ ఆన్ ట్రేడ్ ద్వారా హార్దిక్ పాండ్యా, సర్జరీ కారణంగా మహ్మద్ షమీ గుజరాత్ టీమ్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు యంగ్ ప్లేయర్ రాబిన్ మింజ్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టుకు భారీ షాక్ తగిలినట్లైంది. అయితే రాబిన్ ప్లేస్ లో టీమిండియా చిచ్చరపిడుతు సర్ఫరాజ్ ఖాన్ ను తీసుకునే ఆలోచనలో గుజరాత్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇదే నిజమైతే.. ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఐపీఎల్ లో మెరుపులు మెరిపించడం ఖాయం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సర్జరీ తర్వాత చాలా కాలం ఆటకు దూరమైన గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఆ టీమ్ కు సానుకూలమైన అంశం. ఇక ఇప్పుడు సర్ఫరాజ్ లాంటి డాషింగ్ బ్యాటర్ కూడా జట్టులోకి వస్తున్నాడన్న వార్త గుజరాత్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: ట్రోలింగ్ పై చాహల్ భార్య ఎమోషనల్.. తమ కుటుంబాన్ని బాధపెట్టారంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి