iDreamPost
android-app
ios-app

IPL 2024 Auction: CSKలోకి తెలుగు కుర్రాడు.. అవనీశ్​ రావుకు ఛాన్స్ ఇచ్చిన చెన్నై!

  • Published Dec 20, 2023 | 9:24 AM Updated Updated Dec 20, 2023 | 9:24 AM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓ తెలుగు క్రికెటర్​కు ఛాన్స్ ఇచ్చింది. ఫ్యూచర్​ కోసం బాటలు వేస్తున్న సీఎస్కే.. ఈ కుర్రాడు తమకు పనికొస్తాడని భావించి టీమ్​లోకి తీసుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓ తెలుగు క్రికెటర్​కు ఛాన్స్ ఇచ్చింది. ఫ్యూచర్​ కోసం బాటలు వేస్తున్న సీఎస్కే.. ఈ కుర్రాడు తమకు పనికొస్తాడని భావించి టీమ్​లోకి తీసుకుంది.

  • Published Dec 20, 2023 | 9:24 AMUpdated Dec 20, 2023 | 9:24 AM
IPL 2024 Auction: CSKలోకి తెలుగు కుర్రాడు.. అవనీశ్​ రావుకు ఛాన్స్ ఇచ్చిన చెన్నై!

ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ అనుకున్న దాని కంటే చాలా ఇంట్రెస్టింగ్​గా సాగింది. టోర్నీ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ ధరకు కొందరు ప్లేయర్లు అమ్ముడుపోయారు. మామూలుగా ఎవరైనా బ్యాటర్ల కోసం హై బిడ్డింగ్​కు వెళ్తారు. కానీ ఈసారి చాలా టీమ్స్​లో బౌలర్ల కొరత ఉండటంతో వారి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పర్స్​లో భారీగా డబ్బులు ఉండటం, పక్క టీమ్స్​ను డామినేట్ చేసే ఉద్దేశంతోనూ పేస్ బౌలర్ల మీద ఈసారి వేలంలో భారీ బిడ్డింగ్ జరిగింది. వారి కోసం రూ.కోట్లకు రూ.కోట్లు పోసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. తొలుత ప్యాట్ కమిన్స్​కు రూ.20.50 కోట్లు దక్కితే క్రికెట్ వరల్డ్ షాక్ అయింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మిచెల్ స్టార్క్ ఏకంగా రూ.24.75 కోట్లు కొల్లగొట్టి.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్​గా నిలిచాడు. ఇక, ఈసారి ఆక్షన్​లో ఓ తెలుగు కుర్రాడికి ఛాన్స్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. తెలంగాణకు చెందిన అవనీశ్​ రావును సీఎస్​కే కొనుక్కుంది.

మినీ వేలంలో తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన అరవెల్లి అవనీశ్ రావును సీఎస్​కే కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకే అతడ్ని తీసుకుంది. ఆక్షన్ ఆఖర్లో ఈ 18 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాటర్​ పేరు రాగా.. వెంటనే చెన్నై జట్టు కొనుగోలు చేసింది. ఈసారి మొత్తంగా 11 మంది తెలుగు ప్లేయర్లు వేలం బరిలో నిలిచారు. అయితే వారిలో కేఎస్ భరత్​తో పాటు అవనీశ్​ రావు మాత్రమే అమ్ముడుపోయాడు. మిగిలిన 9 మంది అన్​సోల్డ్​గా నిలిచారు. భరత్​ను కోల్​కతా నైట్ రైడర్స్​ సొంతం చేసుకుంది. రూ.50 లక్షల ధర చెల్లించి అతడ్ని దక్కించుకుంది. ఇక, అవనీశ్​ రావును అయితే అదృష్టం వరించిందనే చెప్పాలి. లాస్ట్ మూమెంట్​లో అతడు సీఎస్​కేలోకి వచ్చాడు. అతడి పేరు వేలంలోకి రాగానే వెంటనే రియాక్ట్ అయిన చెన్నై.. ఇరవై లక్షల బేస్ ప్రైజ్​కు సొంతం చేసుకుంది.

అవనీశ్ రావును తమ టీమ్​లోకి ఆహ్వానిస్తున్నామని ట్విట్టర్​లో పోస్ట్ పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం, పోత్గల్ గ్రామానికి చెందిన అవనీశ్ రీసెంట్​గా టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. అండర్-19 ముక్కోణపు సిరీస్​లో అతడు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అటు కీపింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ దుమ్మురేపి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఒక మ్యాచ్​లో 376 రన్స్ ఛేజింగ్​కు దిగిన భారత్ జట్టు ఓ దశలో 95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ టైమ్​లో తానున్నానంటూ ఆదుకున్నాడు అవనీశ్. 93 బంతుల్లోనే 12 సిక్సర్ల సాయంతో ఏకంగా 163 పరుగులు చేసి టీమ్​కు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్​కు ఫిదా అయిన సీఎస్కే అతడి పేరు వేలంలోకి రాగానే కొనుగోలు చేసింది. మరి.. సిరిసిల్ల కుర్రాడికి చెన్నై ఛాన్స్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో వన్డే.. టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు..!