Somesekhar
కోల్ కత్తా-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. SRH vs KKR మ్యాచ్ కు గంట సేపు బ్రేక్ పడనుందా? కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
కోల్ కత్తా-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. SRH vs KKR మ్యాచ్ కు గంట సేపు బ్రేక్ పడనుందా? కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ మెగా జాతర ప్రారంభం అయ్యింది. తొలి మ్యాచ్ లోనే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఇక రెండో రోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో మెుదటి మ్యాచ్ లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ టీమ్స్ తలపడనున్నాయి. ఇక సెకండ్ పోరులో కోల్ కత్తా-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. SRH vs KKR మ్యాచ్ కు గంట సేపు బ్రేక్ పడనుందా? కారణం? పూర్తి వివరాల్లోకి వెళితే..
క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. SRH vs KKR మ్యాచ్ కు గంట సేపు బ్రేక్ పడనుందా? అసలు ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 23 ఈ డేట్ కు ఓ స్పెషాలిటి ఉంది. అదేంటంటే? ప్రతీ సంవత్సరం ఈ రోజులో ఒక గంట పాటు ప్రపంచ వ్యాప్తంగా లైట్లు ఆర్పేసి భూమాతకు మద్ధతుగా నిలవాలి. ఈ రోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు అంటే గంట సేపు ప్రపంచ వ్యాప్తంగా లైట్లు ఆర్పేయనున్నారు. ఈ మాహా యాగంలో 190 దేశాలు భాగస్వామ్యం అయ్యాయి.
అయితే ఇదే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కు అడ్డంకిగా మారింది. రాత్రి 7:30కు మ్యాచ్ స్టార్ట్ అయ్యి.. 11 గంటలకు ఎండ్ అవుతుంది. కానీ ఎర్త్ అవర్ ఈ టైమ్ మధ్యలోనే ఉండటంతో.. కోల్ కత్తా-సన్ రైజర్స్ మ్యాచ్ మధ్యలో ఎర్త్ అవర్ కు మద్ధతుగా గంట సేపు బ్రేక్ ఇస్తారా? ఇవ్వరా? అన్నది ఇప్పుడు మిలిన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. గొప్ప మనసుతో దీన్ని అనుసరిస్తే బాగుంటుందని పర్యావరణ పరిరక్షణ సంఘాలు కోరుతున్నాయి. అయితే గంట సేపు కరెంట్ లేకుండా ప్రేక్షకులు మైదానంలో ఏం చేస్తారు? ఆటగళ్లు ఎలా ఉంటారు? అన్నదే చర్చనీయాంశంగా మారింది.
ఇదంతా కాసేపు పక్కనపెడితే.. గంట సేపు సమయం వృథా అయితే బ్రాడ్ కాస్టింగ్ విషయంలో తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. టెలికాస్ట్ టైమింగ్ లో మార్పులు వస్తాయి. చూడాలి మరి బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందో? ఇదిలా ఉండగా.. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ఈ ఎర్త్ అవర్ ను 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభించింది. వాతావరణంలో వస్తున్న పెను మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదరు సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: వీడియో: కోహ్లీని అడ్డుకున్న రహానె! మ్యాచ్‌లో ఇదే హైలెట్ సీన్..