iDreamPost

వీడియో: కోహ్లీని అడ్డుకున్న రహానె! మ్యాచ్‌లో ఇదే హైలెట్‌ సీన్‌..

చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఓ హైలెట్ సీన్ జరిగింది. కోహ్లీని వెనక్కి పంపాడు రహానే. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఓ హైలెట్ సీన్ జరిగింది. కోహ్లీని వెనక్కి పంపాడు రహానే. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

వీడియో: కోహ్లీని అడ్డుకున్న రహానె! మ్యాచ్‌లో ఇదే హైలెట్‌ సీన్‌..

ఎన్నో ఆశలతో ఐపీఎల్ 17వ ఎడిషన్ లోకి అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు తొలి మ్యాచ్ లోనే భారీ షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటర్లు విఫలం కావడంతో 174 పరుగుల ఓ మోస్తారు లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. ఆ టార్గెట్ ను 18.4 ఓవర్లలోనే ఛేదించింది రుతురాజ్ టీమ్. ఇక ఈ మ్యాచ్ లో ఓ హైలెట్ సీన్ జరిగింది. విరాట్ కోహ్లీని వెనక్కి పంపాడు రహానే. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ.. లాంగ్ గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి అడుగుపెట్టాడు. దీంతో ఫ్యాన్స్ విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ ను కోరుకున్నారు. కానీ వారి అంచనాలను అందుకోలేకపోయిన కోహ్లీ 20 బంతుల్లో 21 రన్స్ చేసి పెవిలియన్ కు చేరాడు. అయితే మ్యాచ్ లో కొద్ది కొద్దిగా టచ్ లోకి వస్తున్నట్లు కనిపించిన విరాట్ ను.. అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అడ్డుకున్నాడు సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే. అసలేం జరిగిందంటే? ముస్తాఫిజుర్ రెహ్మన్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఈ దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఈ ఓవర్లో 2వ బంతిని భారీ షాట్ కు ప్రయత్నించాడు. బాల్ నేరుగా బౌండరీ లైన్ వద్ద పడుతుందని అందరూ భావించారు.

కానీ మెరుపు వేగంతో దూసుకొచ్చిన అజింక్యా రహానే బాల్ ను ఒడిసిపట్టుకుని బ్యాలెన్స్ తప్పుతున్నానని గ్రహించి.. వెంటనే రచిన్ కు బంతిని విసిరేశాడు. రచిన్ రవీంద్ర బాల్ ను జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఇక డైవ్ చేస్తూ బ్యాలెన్స్ తప్పిన రహానే బౌండరీ లైన్ కు తాకాడు. దీంతో రహానే ఫీల్డింగ్ కు కంగుతిన్న విరాట్.. పెవిలియన్ చేరాడు. అత్యంత చాకచక్యంగా ఆలోచించి బాల్ ను విసిరేశాడు సీనియర్ ప్లేయర్. ఈ క్యాచ్ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు రహానేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాలు ఏంటి సామి? నీలో ఇంకా పస తగ్గలేదు. రహానే జీ గ్రేట్ క్యాచ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కితాబిస్తున్నారు. మరి మెరుపు వేగంతో వచ్చి విరాట్ ను వెనక్కి పంపిన రహానే ఫీల్డింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: గుజరాత్ కు గుడ్ న్యూస్.. రాబిన్ మింజ్ ప్లేస్ లో చిచ్చర పిడుగు ఎంట్రీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి