iDreamPost

Virat Kohli: కోహ్లీ 2.O కాదు.. అంతకుమించి! ఇవిగోండి లెక్కలు.. ఇవే ప్రూఫ్!

  • Published May 21, 2024 | 9:43 PMUpdated May 21, 2024 | 9:43 PM

ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా తనలోని రాక్షసుడ్ని బయటకు తీసుకొస్తూ పించ్ హిట్టింగ్​తో అదరగొడుతున్నాడు.

ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా తనలోని రాక్షసుడ్ని బయటకు తీసుకొస్తూ పించ్ హిట్టింగ్​తో అదరగొడుతున్నాడు.

  • Published May 21, 2024 | 9:43 PMUpdated May 21, 2024 | 9:43 PM
Virat Kohli: కోహ్లీ 2.O కాదు.. అంతకుమించి! ఇవిగోండి లెక్కలు.. ఇవే ప్రూఫ్!

విరాట్ కోహ్లీ.. దశాబ్దంన్నరగా అదరగొడుతూ బెస్ట్ బ్యాటర్​గా పేరు తెచ్చుకున్నాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ గురించి తెలిసిందే. సింగిల్స్, డబుల్స్​తో రిథమ్​లోకి రావడం, క్రీజులో సెటిల్ అయ్యాక బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం అతడి శైలి. ఒక్కోసారి అవసరాన్ని బట్టి గేర్లు మార్చి భారీ సిక్సులు బాదడం కూడా కింగ్​కు తెలుసు. కానీ విరాట్ మరీ దూకుడుగా ఆడిన సందర్భాలు తక్కువ. యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడుతూ మ్యాచ్​లు ముగించడం అతడికి అబ్బిన విద్య. కానీ ఇప్పుడు అతడు కొత్తగా కనిపిస్తున్నాడు. ఐపీఎల్-2024లో కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా తనలోని రాక్షసుడ్ని బయటకు తీసుకొస్తూ పించ్ హిట్టింగ్​తో అదరగొడుతున్నాడు.

సీజన్​లో ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచుల్లో కలిపి ఏకంగా 708 పరుగులు చేశాడు కోహ్లీ. ఇందులో ఓ సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. కింగ్ స్ట్రయిక్ రేట్ 155గా ఉంది. మునుపటి కంటే వేగంగా పరుగులు చేస్తున్నాడు. భారీ షాట్లు బాదుతూ బౌలర్లను భయపెడుతున్నాడు. దీంతో అందరూ ఇది కోహ్లీ 2.0 వెర్షన్​ అని అంటున్నారు. కానీ ఇది దానికి మించి అనే చెప్పాలి. దీనికి ఈ లెక్కలే సాక్ష్యం. ఐపీఎల్-2023లో కోహ్లీ 639 పరుగులు చేశాడు. ఆ సీజన్​లో 65 బౌండరీలు కొట్టిన కోహ్లీ.. 16 సిక్సులు బాదాడు. కానీ ఐపీఎల్-2024లో పూర్తిగా మారిపోయాడు. తనలోని విధ్వంసకారుడ్ని బయటకు తీసుకొచ్చాడు. ఊచకోతకు సరికొత్త డెఫినిషన్ చెబుతూ చెలరేగిపోతున్నాడు.

ఈ సీజన్​లో విరాట్ 59 బౌండరీలు, 37 సిక్సులు బాదాడు. గత సీజన్​తో పోలిస్తే అతడి సిక్సుల సంఖ్య డబుల్ అయింది. స్ట్రయిక్ రేట్ కూడా పెరిగింది. నీళ్లు తాగినంత సులువుగా ఈ సీజన్​లో సిక్సులు కొడుతున్నాడు కింగ్. స్పిన్నర్ల బౌలింగ్​లో కోహ్లీ వీక్​ అనే విమర్శలు వస్తుంటాయి. ఐపీఎల్​-2024లో ఆ బలహీనతను కూడా అధిగమించాడు. స్పిన్​ను ఎదుర్కొంటూ 72 యావరేజ్​తో పరుగులు చేశాడు. స్పిన్ బౌలింగ్​లో అతడి స్ట్రయిక్ రేట్ 138గా ఉంది. ఈ సీజన్​లో ఓపెనర్​గా వస్తున్న కింగ్.. పవర్​ప్లేలో 161 స్ట్రయిక్ రేట్​తో పరుగుల వరద పారిస్తున్నాడు. అదే గత సీజన్​లో పవర్​ప్లేలో అతడి స్ట్రయిక్ రేట్ 136గానే ఉంది. కోహ్లీ బ్యాటింగ్​లో సిక్సులు కొట్టే ఎబిలిటీస్​ను పెంచుకోవడం, స్పిన్ బౌలింగ్​ను సమర్థంగా ఎదుర్కోవడాన్ని చూడొచ్చు. అలాగే బౌండరీల కంటే సిక్సుల మీదే అతడు ఎక్కువ ఫోకస్ చేయడాన్ని గమనించొచ్చు. మరి.. కోహ్లీ ఆడుతున్న తీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cricbuzz (@cricbuzzofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి