iDreamPost
android-app
ios-app

Travis Head: 8 ఏళ్ల పగ.. హెడ్ విధ్వంసం వెనక అసలు కథ! తెలిస్తే షాకే!

  • Published Apr 16, 2024 | 10:03 AM Updated Updated Apr 16, 2024 | 10:03 AM

ఆర్సీబీపై ట్రావిస్ హెడ్ సృష్టించిన విధ్వంసం వెనక 8 ఏళ్ల పగ ఉందని మీకు తెలుసా? ఆ కసిని తాజాగా జరిగిన మ్యాచ్ లో చూపించాడు. మరి హెడ్ ఊచకోత వెనక దాగున్న ఆ కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

ఆర్సీబీపై ట్రావిస్ హెడ్ సృష్టించిన విధ్వంసం వెనక 8 ఏళ్ల పగ ఉందని మీకు తెలుసా? ఆ కసిని తాజాగా జరిగిన మ్యాచ్ లో చూపించాడు. మరి హెడ్ ఊచకోత వెనక దాగున్న ఆ కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

Travis Head: 8 ఏళ్ల పగ.. హెడ్ విధ్వంసం వెనక అసలు కథ! తెలిస్తే షాకే!

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లను చీల్చిచెండాడుతూ.. కేవలం 39 బంతుల్లోనే శతకం బాదాడు. ఓవరాల్ గా 41 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. అయితే ఈ ఊచకోత వెనక హెడ్ 8 ఏళ్ల పగ దాగిఉంది. అవును ఇది నిన్న మెున్నటి కసి కాదు.. ఎనిదేళ్ల నాటిది. హెడ్ థండర్ ఇన్నింగ్స్ వెనక అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ట్రావిస్ హెడ్.. ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆర్సీబీతో తాజాగా జరిగిన మ్యాచ్ లో విధ్వంసానికి సరికొత్త నిర్వచనం చెబుతూ.. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై భీకర యుద్ధానికి దిగాడు. కనికరం లేకుండా తన బ్యాట్ కు పనిచెప్పాడు. అయితే హెడ్ ఇంత కసిగా ఆడటానికి బలమైన కారణం ఒకటుంది. అదే హెడ్ ను ఆర్సీబీపై ఇంతగా రెచ్చిపోయేందుకు రీజన్ గా మారింది. హెడ్ ఈ రకంగా విధ్వంసం సృష్టించడం వెనక 8 ఏళ్ల పగ ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఆ కథ ఏంటంటే?

అది 2016 ఐపీఎల్ సీజన్.. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లో ఉన్నాడు ట్రావిస్ హెడ్. టీమ్ లోకి తీసుకున్నారు కానీ.. అతడిని సరిగ్గా వాడుకోలేకపోయారు. ఓపెనర్ గా దింపాల్సిన వాడిని లోయరార్డర్ లో దించారు. పైగా ఇచ్చిన అవకాశాలు కూడా తక్కువే. దీంతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి సరైన ఛాన్స్ కూడా ఇవ్వకుండా హెడ్ ను టీమ్ ను తొలగించారు. దీంతో అప్పటి నుంచి ఆర్సీబీపై పగ పెంచుకున్నాడు. ఆ కసిని అంతా ఇప్పుడు వెళ్లదీశాడు. తనను పొమ్మన్న టీమ్ కు చుక్కలు చూపుతూ.. విజయం దక్కకుండా చేశాడు. తన 8 ఏళ్ల పగను ఈ విధంగా తీర్చుకున్నాడు. ఓ ప్లేయర్ కు సరైన అవకాశాలు ఇచ్చినప్పుడే అతడిలో ఉన్న ఆటగాడు బయటకి వస్తాడు. అంతే తప్ప తక్కువ అవకాశాలు ఇచ్చి ఆడమంటే ఎలా? అందుకే ఎప్పుడైనా సరే ఓ ప్లేయర్ లో ఆట ఉందని తెలిస్తే.. అతడికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది అంటున్నారు నెటిజన్లు. మరి ట్రావిస్ హెడ్ విధ్వంసం వెనక ఉన్న 8 ఏళ్ల పగపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.