iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: ముంబై ఫ్యాన్స్ ఆశలు ఆవిరి.. ముంచేసిన సూర్యకుమార్ యాదవ్..

  • Published Apr 07, 2024 | 4:42 PM Updated Updated Apr 07, 2024 | 4:42 PM

ఎన్నో ఆశలు పెట్టుకున్న ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పై ట్యాంకర్ నీళ్లు గుమ్మరించాడు సూర్యకుమార్ యాదవ్. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ప్లేయర్ డకౌట్ గా వెనుదిరిగి వారి ఆశలను ఆవిరి చేశాడు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పై ట్యాంకర్ నీళ్లు గుమ్మరించాడు సూర్యకుమార్ యాదవ్. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ప్లేయర్ డకౌట్ గా వెనుదిరిగి వారి ఆశలను ఆవిరి చేశాడు.

Suryakumar Yadav: ముంబై ఫ్యాన్స్ ఆశలు ఆవిరి.. ముంచేసిన సూర్యకుమార్ యాదవ్..

సూర్యకుమార్ యాదవ్.. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడని అందరూ భావించారు. వీరుడు, సూరుడు టీమ్ లోకి వస్తున్నాడని సంబరపడ్డారు. లాంగ్ గ్యాప్ తర్వాత గాయం నుంచి కోలుకుని క్రీజ్ లోకి అడుగుపెట్టాడు. వరుస ఓటముల్లో ఉన్న తమ జట్టును విజయాల బాటపట్టిస్తాడని ముంబై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారందరి ఆశలను ఆవిరి చేస్తూ.. రెండు బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

సూర్యకుమార్ యాదవ్ పై ముంబై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. ఎన్నో అంచనాల నడుమ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ స్టార్ ప్లేయర్. సర్జరీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని బ్యాటింగ్ కు వచ్చిన సూర్య.. ఒత్తిడిలో చిత్తైయ్యాడు. హ్యాట్రిక్ ఓటములతో ఉన్న ముంబై ఇండియన్స్ ను గెలుపు బాట పట్టించడానికి సూర్య వస్తున్నాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ వారి సంతోషాన్ని కొన్ని నిమిషాలు కూడా ఉండనివ్వలేదు సూర్య. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరి నిరాశపరిచాడు. అతడిపై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైయ్యాయి. నోర్ట్జే బౌలింగ్ లో జేక్ ఫ్రేజర్ కు క్యాచ్ ఇచ్చి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు అదిరిపోయే మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్. వీరిద్దరు ఉన్నంతసేపు ఢిల్లీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. మరీ ముఖ్యంగా రోహిత్ దంచికొట్టాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 49 పరుగులు చేసి ఒక్క పరుగుతో అర్ధసెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 42 రన్స్ చేశాడు. వీరు తొలి వికెట్ కు 7 ఓవర్లకు 80 రన్స్ జోడించారు. మరి ముంబై ఫ్యాన్స్ ఆశలను ఆవిరి చేసిన సూర్యకుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.