iDreamPost
android-app
ios-app

రోహిత్ శర్మకు షాకిచ్చిన లేడీ ఫ్యాన్! వైరలవుతున్న వీడియో..

  • Published Apr 07, 2024 | 4:16 PM Updated Updated Apr 07, 2024 | 4:16 PM

రోహిత్ శర్మకు ఓ లేడీ ఫ్యాన్ ఊహించని షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోహిత్ శర్మకు ఓ లేడీ ఫ్యాన్ ఊహించని షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Apr 07, 2024 | 4:16 PMUpdated Apr 07, 2024 | 4:16 PM
రోహిత్ శర్మకు షాకిచ్చిన లేడీ ఫ్యాన్! వైరలవుతున్న వీడియో..

ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం(ఏప్రిల్ 7)న ముంబై ఇండియన్స్ టీమ్ తలపడబోతోంది. ముంబై హోం గ్రౌండ్ అయిన వాంఖండే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడి చేరుకున్న ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ ను చేస్తున్నాయి. ఇక సొంత మైదానంలో సత్తాచాటి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది ఎంఐ టీమ్. ఈ క్రమంలో రోహిత్ శర్మకు ఓ లేడీ ఫ్యాన్ ఊహించని షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించడంతో ఫ్యాన్స్ ఎంఐ యాజమాన్యంపై కోపంగా ఉన్నారు. ఇక తమ కోపాన్ని ముంబై ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లోనూ ప్రదర్శిస్తూ వస్తున్నారు. హార్దిక్ పాండ్యాను తిడుతూ.. మ్యాచ్ జరుగుతుంటే నినాదాలు చేస్తూ వస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తొలగించిన దగ్గరి నుంచి రోహిత్ పై ఫ్యాన్స్ లో అభిమానం ఎక్కువైపోయింది. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ కోసం వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు ఇరు జట్ల ప్లేయర్లు.

ఈ క్రమంలోనే గ్రౌండ్ లో రిలాక్స్ గా కూర్చున్న రోహిత్ శర్మ దగ్గరికి ఓ లేడీ ఫ్యాన్ వేగంగా పరుగెత్తుకెళ్లి.. అతడి పాదాలకు నమస్కరించింది. దీంతో ఫ్యాన్ నుంచి ఇది ఊహించని రోహిత్ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యాడు. ఆ లేడీ తన వెంట తెచ్చుకున్న రోహిత్ ఫొటోపై ఆటోగ్రాఫ్ తీసుకుంది. తర్వాత హిట్ మ్యాన్ తో ఫొటో దిగి ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సీజన్ లో రోహిత్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. మూడు మ్యాచ్ ల్లో కేవలం 69 పరుగులు మాత్రమే చేసి, అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాడు. మరి ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ లోనైనా ఫామ్ లోకి వచ్చి తన బ్యాట్ కు పనిచెప్తాడో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet