iDreamPost
android-app
ios-app

సూర్యకుమార్​తో క్రికెట్ ఆడుతున్న ఈ బుడ్డోడ్ని గుర్తుపట్టారా? అతని తండ్రి కూడా స్టార్!

  • Published Apr 11, 2024 | 10:28 PM Updated Updated Apr 11, 2024 | 10:28 PM

సూర్యకుమార్ యాదవ్​తో కలసి క్రికెట్ ఆడుతున్న ఈ బుడ్డోడ్ని గుర్తుపట్టారా? అతని తండ్రి కూడా ఓ స్టార్ క్రికెటరే కావడం విశేషం.

సూర్యకుమార్ యాదవ్​తో కలసి క్రికెట్ ఆడుతున్న ఈ బుడ్డోడ్ని గుర్తుపట్టారా? అతని తండ్రి కూడా ఓ స్టార్ క్రికెటరే కావడం విశేషం.

  • Published Apr 11, 2024 | 10:28 PMUpdated Apr 11, 2024 | 10:28 PM
సూర్యకుమార్​తో క్రికెట్ ఆడుతున్న ఈ బుడ్డోడ్ని గుర్తుపట్టారా? అతని తండ్రి కూడా స్టార్!

క్రికెటర్లకు ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంటుందనేది తెలిసిందే. ఏ దేశం తరఫున ఆడినా రాణిస్తే చాలు గుర్తింపు వచ్చేస్తుంది. అయినా టీ20, టీ10 లీగ్స్ వచ్చేసినప్పటి నుంచి ఆ దేశం, ఈ దేశం అనే తేడాలు పోయాయి. ఎక్కడి ప్లేయర్ అయినా సరే.. బాగా ఆడితే ఆదరించేస్తున్నారు ఆడియెన్స్. తన బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసేందుకు ఆటగాళ్లు కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఐపీఎల్ ద్వారా చాలా మంది ఫారెన్ ప్లేయర్స్ భారతీయుల మనసుల్లో చోటు దక్కించుకున్నారు. ఆ క్రికెటర్ కూడా తన స్పిన్ బౌలింగ్, హార్డ్ హిట్టింగ్​తో క్రికెట్ లవర్స్​కు ఫేవరెట్​గా మారాడు. అతడి కుమారుడి బ్యాటింగ్ వీడియో ఇప్పుడు వైరల్​గా మారుతోంది.

ఆఫ్ఘానిస్థాన్ స్టార్ ఆల్​రౌండర్ మహ్మద్ నబీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్పిన్ బౌలింగ్​తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో అతడు ఆరితేరాడు. అదే సమయంలో ఇన్నింగ్స్​ ఆఖర్లో వచ్చి ధనాధన్ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చడంలోనూ అతడు దిట్టే. ఆఫ్ఘాన్ టీమ్​లో కీలకంగా మారిన ఈ ఆల్​రౌండర్.. ఐపీఎల్ ద్వారా ఇక్కడా మంచి క్రేజ్ సంపాదించాడు. సన్​రైజర్స్ జట్టులో ఆడుతూ ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాంటి నబీ కుమారుడి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ఈ సీజన్​లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు నబీ. దీంతో అతడి కొడుకుతో కలసి సరదాగా కాసేపు క్రికెట్ ఆడాడు మిస్టర్ 360.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్​కు ముందు జూనియర్ నబీతో కలసి క్రికెట్ ఆడాడు సూర్యకుమార్. నబీ కొడుక్కి అతడు బౌలింగ్ వేస్తూ కనిపించాడు. మిస్టర్ 360 వేసిన బంతులకు ఆ బుడ్డోడు భారీ షాట్లు బాదాడు. లెఫ్టాండ్​తో పవర్ హిట్టింగ్​ చేశాడు. సూర్య బాల్ వేసిందే తడవుగా ప్రొఫెషనల్ బ్యాటర్​గా షాట్లు కొట్టాడు. ఆ తర్వాత బాల్​ను డిఫెన్స్ చేశాడు. దీంతో సిక్స్ తర్వాత సింగిల్ తీస్తావా అంటూ అతడ్ని సూర్యకుమార్ ఆటపట్టించాడు. అనంతరం మళ్లీ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు జూనియర్ నబీ. డిఫరెంట్ షాట్స్ కొట్టాడు. నబీ కుమారుడి గురించి సూర్య మాట్లాడుతూ.. బుడ్డోడు చాలా టాలెంటెడ్ అని, అతడిలో ఆల్​రౌండ్ ఎబిలిటీస్ ఉన్నాయని మెచ్చుకున్నాడు.