iDreamPost
android-app
ios-app

SRH vs GT: వర్షంతో మ్యాచ్ రద్దు కావడం SRHకి లాభం కాదు.. నష్టమని మీకు తెలుసా? ఎలాగంటే?

వర్షం కారణంగా గుజరాత్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు లాభం కంటే.. నష్టమే ఎక్కువ అన్న సంగతి మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వర్షం కారణంగా గుజరాత్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు లాభం కంటే.. నష్టమే ఎక్కువ అన్న సంగతి మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

SRH vs GT: వర్షంతో మ్యాచ్ రద్దు కావడం SRHకి లాభం కాదు.. నష్టమని మీకు తెలుసా? ఎలాగంటే?

ఐపీఎల్ 2024 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ కు వెళ్లే మూడు టీమ్స్ ఏవో.. అందరికి తెలిసిపోయింది. కోల్ కత్తా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. SRH 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. దాంతో హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. కానీ మ్యాచ్ రద్దు కావడం సన్ రైజర్స్ కి లాభం కాదని, నష్టమని మీకు తెలుసా? ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

నిన్న గుజరాత్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. దాంతో SRH ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. కానీ వర్షంతో మ్యాచ్ రద్దుకావడం సన్ రైజర్స్ కు లాభం కాదు.. నష్టమని మీకు తెలుసా? ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం హైదరాబాద్ టీమ్ మూడో స్థానంలో ఉంది. టోర్నీలో టాప్ 2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ 1లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఇందులో విజయం సాధించిన టీమ్ నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఇక ఓడిపోయిన జట్టుకు మాత్రం ఇంకో అవకాశం ఉంటుంది.

క్వాలిఫయర్ 2 ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ తో క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు తలపడుతుంది. దాంతో పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ లో నిలిచే జట్టుకు రెండు అవకాశాలు ఉంటాయి. తాజాగా గుజరాత్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పక తప్పడు. ఇక ఇప్పుడు SRH సెకండ్ ప్లేస్ కు రావాలంటే? పంజాబ్ తో ఆడనున్న చివరి లీగ్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి. దీంతో పాటుగా కోల్ కత్తా చేతిలో రాజస్తాన్ ఓడిపోవాలి.

ఈ క్రమంలోనే SRH-పంజాబ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే కూడా హైదరాబాద్ టీమ్ సెకండ్ ప్లేస్ కు చేరొచ్చు. కానీ ఇందుకోసం ఇతర జట్లపై ఆధారపడాల్సి వస్తుంది. సన్ రైజర్స్ టీమ్ సెకండ్ ప్లేస్ కు వెళ్లాలంటే.. చెన్నైను ఆర్సీబీ తప్పక ఓడించాలి. మరోవైపు కేకేఆర్ చేతిలో రాజస్తాన్ ఓడిపోవాలి. ఇక చెన్నై రెండో స్థానానికి ఎగబాకాలంటే? ఆర్సీబీని ఓడించడంతో పాటుగా హైదరాబాద్, రాజస్తాన్ టీమ్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. కోల్ కత్తాపై నెగ్గితే రాజస్తాన్ టాప్ 2లో కొనసాగుతుంది. దాంతో ఆ టీమ్ ఫైనల్ వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది.

అందుకే నిన్న మ్యాచ్ లో గుజరాత్ పై విజయం సాధించి.. చివరి మ్యాచ్ లో కూడా పంజాబ్ ను ఓడిస్తే.. ఇలా ఇతర టీమ్స్ పై ఆధారపడకుండా నేరుగా సెకండ్ ప్లేస్ కు సన్ రైజర్స్ వెళ్లేది. తద్వారా ఫైనల్ కు వెళ్లేందుకు రెండు అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందుకే వర్షంతో గుజరాత్ తో మ్యాచ్ రద్దు కావడం సన్ రైజర్స్ కు నష్టమని నెటిజన్లతో పాటుగా క్రీడా పండితులు అభిప్రాయాపడుతున్నారు. మరి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం SRHకి లాభమా? నష్టమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి