Nidhan
ఉప్పల్ వేదికగా ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే ఓ విషయంలో మాత్రం హార్దిక్ సేనను అందరూ మెచ్చుకోవాల్సిందే.
ఉప్పల్ వేదికగా ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే ఓ విషయంలో మాత్రం హార్దిక్ సేనను అందరూ మెచ్చుకోవాల్సిందే.
Nidhan
ఐపీఎల్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్బ్ బ్యాటింగ్‌తో అదరగొట్టింది. ఒకడు ఉరుమైతే, మరొకడు మెరుపు అన్నట్లు మన జట్టు బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలారు. దీంతో క్యాష్ రిచ్ లీగ్‌లో రికార్డు స్కోరుతో సత్తా చాటింది ఎస్ఆర్హెచ్. ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో కమిన్స్ సేన విక్టరీ కొట్టింది. ఈ సీజన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 277 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఛేజింగ్‌కు దిగిన ఎంఐ 20 ఓవర్లలో 246 పరుగులు చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచినా గానీ ఓ అరుదైన రికార్డును మాత్రం ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబైని హైదరాబాద్ ఓడించింది. కానీ ఓ అరుదైన రికార్డును తన అకౌంట్లో వేసుకుంది ఎంఐ. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 38 సిక్సులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ హిస్టరీలో అత్యధిక సిక్సులు నమోదైన మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు నెక్స్ట్ లెవల్లో హిట్టింగ్ చేశారు. వాళ్లు ఏకంగా 18 సిక్సులు బాదారు. అయితే మన జట్టు బ్యాటర్ల కంటే ముంబై ఆటగాళ్లే ఎక్కువ సిక్సులు కొట్టారు. ఎంఐ బ్యాట్స్‌మెన్ ఏకంగా 20 సిక్సులు కొట్టారు. ఆ రకంగా చూసుకుంటే విజయం సన్‌రైజర్స్‌ను వరించినా అత్యధిక సిక్సుల రికార్డులో మేజర్ షేర్, క్రెడిట్‌ను ఆ టీమే కొట్టేసింది. అందుకే ఈ విషయంలో హార్దిక్ సేనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఓడినా చివరి వరకు పోరాడటం, సిక్సులతో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడం సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు.
ఇక, ఎస్ఆర్హెచ్-ఎంఐ మ్యాచ్ చాలా రికార్డులకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి మొత్తం 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది. 16 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను చేరుకొని సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. ఇదే మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 50), హెన్రిచ్ క్లాసెన్ (23 బంతుల్లో 50) కూడా వేగంగా హాఫ్ సెంచరీలు బాదారు. ఎంఐ బ్యాటర్ తిలక్ వర్మ (24 బంతుల్లో 50) కూడా క్విక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లో ఛేజింగ్‌లో అత్యధిక స్కోరు, టీ20ల్లో అత్యధిక సిక్సులు.. ఇలా చాలా రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి. మరి.. ఎస్ఆర్హెచ్ గెలిచినా గానీ సిక్సుల విషయంలో ముంబై ముందుండటంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: SRHతో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో పాండ్యా స్పీచ్.. వింటే ఆశ్చర్యపోతారు!
Record of most sixes hit in IPL history in SRH vs MI match – 38
Most runs scored in SRH vs MI match in any IPL match in history- 523
MI- 20 Sixes
SRH- 18 SixesSRH- 277-3
MI- 246-5 pic.twitter.com/DEu2KvsjZ2— Daddyscore (@daddyscore) March 27, 2024