iDreamPost
android-app
ios-app

RR కోసం SRH ఆ పిచ్చోడ్ని దింపే ఛాన్స్! విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ అతడు!

  • Published May 21, 2024 | 4:16 PM Updated Updated May 24, 2024 | 1:25 AM

రాజస్థాన్ రాయల్స్​ను ఓడించి ఐపీఎల్-2024 ఫైనల్ బెర్త్​ను ఖాయం చేసుకోవాలని చూస్తోంది సన్​రైజర్స్ హైదరాబాద్. ఇందులో భాగంగా ఇవాళ జరిగే క్వాలిఫయర్-2 కోసం లెక్కపెట్టలేనంత పిచ్చోడ్ని బరిలోకి దింపుతోంది.

రాజస్థాన్ రాయల్స్​ను ఓడించి ఐపీఎల్-2024 ఫైనల్ బెర్త్​ను ఖాయం చేసుకోవాలని చూస్తోంది సన్​రైజర్స్ హైదరాబాద్. ఇందులో భాగంగా ఇవాళ జరిగే క్వాలిఫయర్-2 కోసం లెక్కపెట్టలేనంత పిచ్చోడ్ని బరిలోకి దింపుతోంది.

  • Published May 21, 2024 | 4:16 PMUpdated May 24, 2024 | 1:25 AM
RR కోసం SRH ఆ పిచ్చోడ్ని దింపే ఛాన్స్! విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ అతడు!

గత కొన్నేళ్లుగా దారుణ ప్రదర్శనతో భారీగా విమర్శల్ని మూటగట్టుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్. కప్పు సంగతి పక్కనబెడితే పాయింట్స్ టేబుల్​లో అందరికంటే ఆఖరులో నిలవకపోతే అదే గొప్ప అనుకునే స్థితికి దిగజారింది. ఇంత చెత్తగా ఆడే జట్టు అవసరమా? అంటూ ట్రోలింగ్​కు గురైంది ఎస్​ఆర్​హెచ్. టీమ్ పెర్ఫార్మెన్స్​తో అభిమానులు కూడా విసుగెత్తారు. ఆరెంజ్ ఆర్మీపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఒక్క సీజన్ గ్యాప్​లో అంతా మారిపోయింది. ఐపీఎల్​-2024లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది ఎస్​ఆర్​హెచ్. భారీ స్కోర్లు సాధిస్తూ, లీగ్​లో అసాధ్యమనుకున్న రికార్డులను క్రియేట్ చేసింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్​-2గా నిలిచి..  ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

క్వాలిఫైయర్‌-1లో కేకేఆర్‌పై ఓటమితో నేరుగా ఫైనల్‌ చేరే అవకాశం వదులుకున్న సన్‌రైజర్స్‌. ఇప్పుడు క్వాలిఫైయర్‌-2 కోసం సిద్ధం అవుతుంది. ఈ నెల 24(శుక్రవారం)న ఎలిమినేటర్‌ విజేత రాజస్థాన్‌ రాయల్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌ ఫైనల్స్‌కు వెళ్లి ట్రోఫీ కోసం కేకేఆర్‌తో తలపడుతుంది. తొలి క్వాలిఫైయర్‌లో గెలిచే ఛాన్స్‌ మిస్‌ అయినా.. రెండు క్వాలిఫైయర్‌లో ఎలాగైన గెలవాలని సన్‌రైజర్స్‌ గట్టిగా ఫిక్స్‌ అయింది. అందుకోసం ఒక విధ్వంసాన్ని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విధ్వంసం పేరు గ్లెన్‌ ఫిలిప్స్‌. సన్‌రైజర్స్‌ టీమ్‌లో ఉన్న ఈ ఆటగాడికి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. కానీ,  ఎంతో కీలకమైన క్వాలిఫైయర్‌ 2లో ఫిలిప్స్‌ను ఆడించాలని కమిన్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కివీస్ స్పిన్ ఆల్​రౌండర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. క్వాలిటీ స్పిన్​తో బ్యాటర్లను కట్టిపడేయంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా లెఫ్టాండ్ బ్యాట్స్​మెన్​ ఆటకట్టించడంలో అతడికి మంచి నైపుణ్యం ఉంది. బ్యాట్​తో ఫిలిప్స్ చేసే విధ్వంసం గురించి తెలిసిందే. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్​కు వెళ్లడం ఫిలిప్స్​కు అలవాటు. క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లను ఆడుకోవడం అతడికి సరదా. భారీ షాట్లతో ప్రత్యర్థి జట్టును డిఫెన్స్​లో పడేయడంలో అతడు ఎక్స్​పర్ట్. ఈ దూకుడు వ్యూహంతో న్యూజిలాండ్​కు ఎన్నో విక్టరీలు అందించాడు. బాల్, బ్యాట్​తో అదరగొట్టడమే కాదు.. ఫీల్డింగ్​లో పాదరసంలా కదులుతూ రన్స్ ఆపడం, కష్టసాధ్యమైన క్యాచుల్ని కూడా పట్టేయడంలో ఫిలిప్స్ ఆరితేరాడు. అందుకే అతడ్ని కీలకమైన క్వాలిఫైయర్‌-2లో ఆడించాలని ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్ కమిన్స్ ఫిక్స్ అయ్యాడట.

Glenn philps into SRH vs KKR

ఆర్ఆ‌ర్ టీమ్​లో యశస్వి జైస్వాల్‌, హేట్‌మేయర్‌ రూపంలో సాలిడ్ లెఫ్టాండర్లు ఉన్నారు. వీళ్లను ఆపడానికి మంచి ఆఫ్ స్పిన్నర్ కావాలి. ఫిలిప్స్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి అటు బౌలింగ్​ టైమ్​లో రాజస్థాన్‌ బ్యాటర్లను అడ్డుకోగలడు, బ్యాటింగ్​ టైమ్​లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగలడు, ఫీల్డింగ్​లోనూ సత్తా చాటగలడు.. దీంతో అతడ్ని ట్రంప్ కార్డ్​గా ఉపయోగించాలని ఎస్ఆర్​హెచ్​ మేనేజ్​మెంట్ డిసైడ్ అయిందని తెలుస్తోంది. మరి.. గ్లెన్ ఫిలిప్స్ ఆడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.