Nidhan
ఐపీఎల్-2024 ఫైనల్‌కు అంతా రెడీ అయింది. సండే ఫైట్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి కోల్‌కతా, హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ ఓనర్ కింగ్ ఖాన్ షారుక్ గట్టి ప్లానే వేశాడు.
ఐపీఎల్-2024 ఫైనల్‌కు అంతా రెడీ అయింది. సండే ఫైట్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి కోల్‌కతా, హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ ఓనర్ కింగ్ ఖాన్ షారుక్ గట్టి ప్లానే వేశాడు.
Nidhan
గత కొన్ని వారాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న ఐపీఎల్-2024 ఎట్టకేలకు తుదిదశకు చేరుకుంది. రేపు జరిగే ఆఖరి పోరుతో లీగ్ ముగిసిపోనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఫైనల్ ఫైట్ జరగనుంది. కప్పు కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వాలిఫైయర్-1లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన జోష్‌లో ఉంది కేకేఆర్. అటు అయ్యర్ సేన చేతిలో దెబ్బతిన్నా తిరిగి కోలుకొని క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి ఫైనల్ వచ్చిన సంతోషంలో ఉంది ఆరెంజ్ ఆర్మీ. ఈ రెండు టీమ్స్ ఫైనల్ ఫైట్ నెక్స్ట్ లెవల్లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అగ్రెసివ్ మోడ్‌లో ఆడటం ఇరు జట్లకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి రేపు ఏ టీమ్ సరైన టైమ్‌కు గేర్లు షిఫ్ట్ చేస్తుందో వాళ్లదే విజయం పక్కాగా కనిపిస్తోంది.
ఫైనల్ మ్యాచ్ కోసం కోల్‌కతా, హైదరాబాద్ సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. తమ టీమ్ మెంటార్ గౌతం గంభీర్ పనితీరును కింగ్ ఖాన్ మెచ్చుకున్నాడు. అలాంటోడి కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నామని అన్నాడు. జట్టును ఇంత సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న గౌతీని ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పాడు. గంభీర్‌ను మెచ్చుకుంటూనే ఓ బంపరాఫర్ కూడా ప్రకటించాడు. అతడు ఇంకో 10 ఏళ్ల పాటు కేకేఆర్‌లోనే ఉండిపోవాలని తాను కోరుకుంటున్నానని షారుక్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత కొన్ని సీజన్లుగా కేకేఆర్ ఆట తీసికట్టుగా తయారైంది. ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోవడంలో ఆ టీమ్ ఫెయిల్ అవుతూ వచ్చింది.
కేకేఆర్ పనైపోయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో టీమ్ మెంటార్‌గా దిగాడు గంభీర్. జట్టు కూర్పులో పలు మార్పులు చేశాడు. అలాగే కొందరు యంగ్ ప్లేయర్లకు ఛాన్సులు ఇచ్చాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కావాల్సిన టైమ్‌లో గైడెన్స్ ఇస్తూ వచ్చాడు. దీంతో ఆ టీమ్ ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో గంభీర్ పనితనాన్ని పొగుడుతూనే అతడికి బంపరాఫర్ ఇచ్చాడు షారుక్. అయితే ఈ ఆఫర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఎస్ఆర్హెచ్తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి కామెంట్‌తో గంభీర్ మీద తనకు ఉన్న భరోసా, నమ్మకాన్ని షారుక్ చూపించాడని అంటున్నారు. సేమ్ టైమ్ కప్పు అందిస్తే అతడి కెరీర్‌కు, కేకేఆర్‌తో జర్నీకి ఢోకా ఉండదని ఇన్‌డైరెక్ట్‌గా హామీ కామెంట్స్ చేస్తున్నారు. సన్‌రైజర్స్‌ను పడగొట్టేందుకు షారుక్ వేసిన ప్లాన్ ఇదని అంటున్నారు. మరి.. షారుక్ స్కెచ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Shah Rukh Khan wants Gautam Gambhir to stay with KKR for a minimum of 10 years. (Dainik Jagran). pic.twitter.com/NAixYIaDvM
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2024