iDreamPost

IPL ఫైనల్​కు వర్షం ముప్పు.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

  • Published May 25, 2024 | 5:10 PMUpdated May 25, 2024 | 5:10 PM

ఐపీఎల్-2024 ఫైనల్​కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాన వల్ల ఒకవేళ మ్యాచ్ రద్దయితే విజేతగా ఎవరు నిలుస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్-2024 ఫైనల్​కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాన వల్ల ఒకవేళ మ్యాచ్ రద్దయితే విజేతగా ఎవరు నిలుస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • Published May 25, 2024 | 5:10 PMUpdated May 25, 2024 | 5:10 PM
IPL ఫైనల్​కు వర్షం ముప్పు.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

ఐపీఎల్-2024 ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్​లో వరుస విజయాలతో హవా నడిపించాయి రెండు జట్లు. పాయింట్స్ టేబుల్​లో టాప్​లో నిలిచాయి. ఆ రెండే ప్లేఆఫ్స్​లో సత్తా చాటి ఫైనల్స్​కు చేరుకున్నాయి. అందులో ఒకటి కోల్​కతా నైట్ రైడర్స్, మరొకటి సన్​రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు టీమ్స్ కప్పు కోసం ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గిన టీమ్ ఛాంపియన్​గా నిలుస్తుంది. ఓడిన జట్టు రన్నరప్​తో సరిపెట్టుకుంటుంది. ఫైనల్ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. క్వాలిఫైయర్-1లో నెగ్గి ఫుల్ కాన్ఫిడెన్స్​తో ఉన్న కేకేఆర్, క్వాలిఫైయర్​-2లో గెలిచి జోష్​లో ఉన్న ఎస్​ఆర్​హెచ్​ ఆఖరి యుద్ధానికి రెడీ అవుతున్నాయి. అయితే ఓ ప్రశ్న అభిమానుల మనసులను తొలచివేస్తోంది.

ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. టైటిల్ ఫైట్​కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. అయితే చెన్నైలో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఫైనల్ మ్యాచ్​ కోసం ఎంతో ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ నిరాశకు లోనవుతున్నారు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఎవరు విజేతగా నిలుస్తారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. ఫైనల్ మ్యాచ్​కు రిజర్వ్ డే ఉంది. అంటే వాన ఆటంకం కలిగించి రేపు ఆట సాధ్యం కాకపోతే సోమవారం నాడు మ్యాచ్​ను నిర్వహిస్తారు. కాబట్టి ఫ్యాన్స్ నిరాశకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఆదివారం కాకపోతే సోమవారం మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఎల్లుండి కూడా వాన వల్ల మ్యాచ్ రద్దయితే మాత్రం ఎస్​ఆర్​హెచ్​కు తీవ్ర నిరాశే ఎదురవుతుంది.

రిజర్వ్ డే నాడు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే అప్పుడు ఇరు జట్ల పాయింట్లను చూస్తారు. గ్రూప్ దశలో అత్యధిక పాయింట్ల సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. దాని ప్రకారం చూసుకుంటే.. పాయింట్స్ టేబుల్​లో టాప్​లో ఉన్న కేకేఆర్ టైటిల్​ను ఎగరేసుకుపోతుంది. పాయింట్ల పట్టికలో ఎస్​ఆర్​హెచ్​ రెండో స్థానంలో ఉంది కాబట్టి రన్నరప్​తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. పూర్తి మ్యాచ్ జరిగితే కేకేఆర్​తో తాడోపేడో తేల్చుకోవచ్చు. ఆదివారంతో పాటు రిజర్వ్ డే అయిన సోమవారం కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే అయ్యర్ సేనను ఛాంపియన్​గా నిలవకుండా ఎవరూ ఆపలేరు. అందుకే ఆరెంజ్ ఆర్మీ అభిమానులు వర్షం పడొద్దని కోరుకోవాలి. మరి.. ఈసారి సన్​రైజర్స్ కప్పు గెలుస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి