iDreamPost

SRH మరో అరుదైన రికార్డు.. IPL హిస్టరీలో ఇది నెవర్ బిఫోర్!

  • Published Apr 20, 2024 | 9:25 PMUpdated Apr 20, 2024 | 9:25 PM

రికార్డులు సృష్టించాలన్నా మేమే, ఆ రికార్డులను తిరగరాయాలన్నా మేమే అనే రీతిలో సన్​రైజర్స్ హైదరాబాద్ చెలరేగి ఆడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో పాత రికార్డుల దుమ్ముదులుపుతోంది ఆరెంజ్ ఆర్మీ.

రికార్డులు సృష్టించాలన్నా మేమే, ఆ రికార్డులను తిరగరాయాలన్నా మేమే అనే రీతిలో సన్​రైజర్స్ హైదరాబాద్ చెలరేగి ఆడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో పాత రికార్డుల దుమ్ముదులుపుతోంది ఆరెంజ్ ఆర్మీ. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ టీమ్​కూ సాధ్యం కాని రీతిలో ఓ ఇన్నింగ్స్​లో 10 ఓవర్లు ముగిసేసరికి 158 పరుగులు చేసింది. తద్వారా పది ఓవర్లలో హయ్యెస్ట్ టోటల్ నమోదు చేసిన టీమ్​గా సన్​రైజర్స్ రికార్డు సృష్టించింది. ఇదే మ్యాచ్​లో మరో రికార్డును కూడా బ్రేక్ చేసింది ఆరెంజ్ ఆర్మీ.

పవర్​ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీమ్​గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది కమిన్స్ సేన. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది సన్​రైజర్స్. టీ20 క్రికెట్​లో ఇప్పటిదాకా పవర్​ప్లేలో ఏ టీమ్ కూడా ఇంత భారీ స్కోరు చేయలేదు. దీనంతటికీ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (32 బంతుల్లో 89), అభిషేక్ శర్మ (12 బంతుల్లో 46)కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఎస్​ఆర్​హెచ్ స్కోరు 17.3 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 228. ఓవర్లన్నీ ముగిసేసరికి టీమ్ 250 పరుగులు చేయడం కన్ఫర్మ్​గా కనిపిస్తోంది. మరి.. ఎస్​ఆర్​హెచ్ రికార్డులపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి