iDreamPost

టీమిండియాలోకి అభిషేక్ శర్మ.. ఆ టోర్నీతోనే జట్టులోకి SRH ఓపెనర్ ఎంట్రీ!

  • Published Apr 06, 2024 | 9:37 AMUpdated Apr 06, 2024 | 9:37 AM

సన్​రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్​ బౌలర్లను ఊచకోత కోశాడు.

సన్​రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్​ బౌలర్లను ఊచకోత కోశాడు.

  • Published Apr 06, 2024 | 9:37 AMUpdated Apr 06, 2024 | 9:37 AM
టీమిండియాలోకి అభిషేక్ శర్మ.. ఆ టోర్నీతోనే జట్టులోకి SRH ఓపెనర్ ఎంట్రీ!

అభిషేక్ శర్మ.. ఈ సన్​రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. చూడటానికి చాలా సింపుల్​గా ఉంటాడు. మరీ అంత పొడగరి కాదు, కండలతో తిరిగిన దేహం కూడా లేదు. కానీ అతడు కొడితే బాల్ స్టాండ్స్​లో పడాల్సిందే. పర్ఫెక్ట్ టైమింగ్​, సరైన టెక్నిక్​తో బంతుల్ని బాదడమే అతడి బలం. భారీ సిక్సులతో ఐపీఎల్-2024లో హైలైట్ అవుతున్నాడు ఈ ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్. రావడం రావడమే బిగ్ షాట్స్ కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను పోయిస్తున్నాడు అభిషేక్. ముంబై ఇండియన్స్​ మీద మ్యాచ్​లోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 23 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 16 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్​ను చేరుకున్నాడు. అతడి ఇన్నింగ్స్​లో 3 ఫోర్లతో పాటు ఏకంగా 7 భారీ సిక్సులు ఉన్నాయి. సీఎస్​కేతో నిన్న జరిగిన మ్యాచ్​లోనూ తన బ్యాట్​తో రెచ్చిపోయాడు అభిషేక్. భారీ షాట్లు బాదుతూ చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. అలాంటోడు టీమిండియాలోకి రాబోతున్నాడని తెలుస్తోంది.

చెన్నైతో మ్యాచ్​లో 12 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు అభిషేక్. ఇందులో 3 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి. ముకేష్ చౌదరీని టార్గెట్ చేసుకున్న ఎస్ఆర్​హెచ్ బ్యాటర్ ఒకే ఓవర్​లో 27 పరుగులు పిండుకున్నాడు. ఇతర బౌలర్లనూ అతడు వదల్లేదు. ఇప్పటివరకు టోర్నీలో ఆడిన 4 మ్యాచుల్లో కలిపి 161 పరుగులు చేశాడు అభిషేక్. ఇందులో 12 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 217.56గా ఉంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్​ లిస్ట్​లో ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నాడు అభిషేక్. ఆ జాబితాలోని టాప్-5 బ్యాటర్స్​లో ఎవ్వరికీ అతడికి ఉన్న స్ట్రైక్ రేట్ లేదు. దీన్ని బట్టే ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్​ ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఐపీఎల్​లో అదరగొడుతున్న అభిషేక్ త్వరలో భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వినిపిస్తోంది.

Abhishek sharma

ఈ ఏడాది జూన్​లో జరిగే టీ20 వరల్డ్ కప్​తో టీమిండియాలోకి అభిషేక్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాల సమాచారం. ఓపెనింగ్ స్పాట్ కోసం అతడ్ని సెలక్టర్లు సీరియస్​గా పరిగణిస్తున్నారని తెలుస్తోంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆల్రెడీ ఫిక్స్. కానీ బ్యాకప్ ఓపెనర్​గా అభిషేక్​ను కరీబియన్ దీవులకు తీసుకెళ్లాలని బోర్డు ప్లాన్ చేస్తోందట. రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ఆ స్థానానికి ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ అతడు పెద్దగా ఫామ్​లో లేడు. అదే టైమ్​లో లెఫ్టాండర్ అయిన అభిషేక్ ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేయడం, పర్ఫెక్ట్ టైమింగ్​తో షాట్లు కొడుతున్న విధానం, పేస్​తో పాటు స్పిన్​నూ సమర్థంగా ఎదుర్కోగల సత్తా సెలక్టర్లకు నచ్చిందట. అందుకే మెగా టోర్నీలో అభిషేక్ ఆడటం పక్కా అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. మరి.. అభిషేక్ శర్మను టీమిండియాలో చూడాలని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: SRHపై CSK బిగ్ మిస్టేక్.. ధోనీ ఉన్నా కూడా ఇలా ఎలా జరిగింది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి