iDreamPost

SRHపై CSK బిగ్ మిస్టేక్.. ధోనీ ఉన్నా కూడా ఇలా ఎలా జరిగింది?

SRH vs CSK- Uppal Stadium: హైదరాబాద్ పై మ్యాచ్ లో చెన్నై జట్టు నామమాత్రపు స్కోర్ చేసింది. అయితే ఇందుకు చెన్నై జట్టు తీసుకున్న ఒక నిర్ణయమే కారణం అంటున్నారు. అందుకే చెన్నై జట్టు స్కోర్ 165కే పరిమితమైంది అంటున్నారు.

SRH vs CSK- Uppal Stadium: హైదరాబాద్ పై మ్యాచ్ లో చెన్నై జట్టు నామమాత్రపు స్కోర్ చేసింది. అయితే ఇందుకు చెన్నై జట్టు తీసుకున్న ఒక నిర్ణయమే కారణం అంటున్నారు. అందుకే చెన్నై జట్టు స్కోర్ 165కే పరిమితమైంది అంటున్నారు.

SRHపై CSK బిగ్ మిస్టేక్.. ధోనీ ఉన్నా కూడా ఇలా ఎలా జరిగింది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ధనా ధన్ విజయాలు నమోదు అవుతున్నాయి. ఏ మ్యాచ్ చూసినా నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది. గ్రౌండ్ ఏదైనా, పిచ్ ఏదైనా ప్రతి మ్యాచ్ లో పరుగుల వరద పారుతోంది. హైదరాబాద్ వేదికగా SRH- CSK మ్యాచ్ లో కూడా అలాంటి ఒక అత్యధిక స్కోర్ నమోదు అవుతుంది అని అంతా భావించారు. హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ అయినా సపోర్టర్స్ మాత్రం అత్యధికంగా హైదరాబాద్ వాళ్లే ఉన్నారు. అయితే అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ చూసి అంతా షాకయ్యారు. అయితే ఇంత తక్కువ స్కోర్ రావడానికి చెన్నై తీసుకున్న ఒక తప్పు నిర్ణయమే కారణం అంటున్నారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. మొదటి నుంచి చెన్నై బ్యాటర్లను కట్టిడ చేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా వేగంగా పరుగులు వచ్చేందుకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. 3 ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయిన చెన్నై జట్టు ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(26) కూడా ఆకట్టుకోలేకపోయాడు. అజింక్య రహానే(35), శివమ్ దూబే(45) కాసేపు స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. కానీ, ఆ తర్వాత వారి పార్టనర్ షిప్ కి కమ్మిన్స్, ఉనడ్ కట్ బ్రేకులు వేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ లైనప్ లో చెన్నై తీసుకున్న నిర్ణయాల వల్లే ఇంత తక్కువ స్కోర్ చేసిందంటూ నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ లో శివమ్ ధూబే అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడాదే ప్రమోషన్ తీసుకుని ఫిఫ్త్ డౌన్ లో వచ్చాడు. నిజానికి ఆ సమయంలో మోయీన్ అలీ వస్తాడు అని అంతా భావించారు. కానీ, అందుకు భిన్నంగా చెన్నై కాస్త ప్రయోగం చేసి జడేజాని పంపినట్లు అనిపించింది. జడేజా 31 పరుగులు చేసినా కూడా.. 23 బంతులు తీసుకున్నాడు. ఆ స్థానంలో మోయిన్ అలీ వచ్చి ఉంటే స్కోర్ బోర్డ్ కనీసం 180 పరుగులకు అయినా చేరి ఉండేది అంటున్నారు. అంతేకాకుండా.. అజింక్యా రహానే అవుట్ అయ్యాక డారెల్ మిచెల్ వచ్చాడు. అప్పుడు కూడా మోయీన్ అలీకి ఛాన్స్ ఇవ్వలేదు. మిచెల్ 11 బంతుల్లో కేవలం 13 పరుగులే చేశాడు.

20వ ఓవర్లో మిచెల్ అవుటయ్యాక ధోనీ బ్యాటింగ్ వచ్చాడు. ఎదుర్కొన్న 2 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. ఇప్పుడు చెన్నై చేసిన ప్రయోగంపై నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత తక్కువ స్కోర్ చేయడానికి కారణం జడేజాని ముందు బ్యాటింగ్ కి పంపడమే అంటున్నారు. ధోనీ టీమ్ లో ఉండగా ఇలాంటి నిర్ణయం అసలు చెన్నై టీమ్ ఎలా తీసుకుంది? అందుకు ఎంఎస్ ధోనీ కూడా అడ్డు చెప్పలేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మోయీన్ అలీ కంటే ముందు జడేజా బ్యాటింగ్ కి రావడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి