iDreamPost

వీడియో: SRHలో మరో రోహిత్.. హిట్​మ్యాన్​ను తలపిస్తున్న తెలుగోడు!

  • Published Apr 10, 2024 | 10:21 AMUpdated Apr 10, 2024 | 10:23 AM

సన్​రైజర్స్ హైదరాబాద్​ వరుస విజయాల్లో ఓ తెలుగోడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. అచ్చం హిట్​మ్యాన్ రోహిత్​ను తలపిస్తున్న ఆ బ్యాటర్.. క్రీజులోకి దిగిందే ఆలస్యం విధ్వంసక షాట్లతో రెచ్చిపోతున్నాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్​ వరుస విజయాల్లో ఓ తెలుగోడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. అచ్చం హిట్​మ్యాన్ రోహిత్​ను తలపిస్తున్న ఆ బ్యాటర్.. క్రీజులోకి దిగిందే ఆలస్యం విధ్వంసక షాట్లతో రెచ్చిపోతున్నాడు.

  • Published Apr 10, 2024 | 10:21 AMUpdated Apr 10, 2024 | 10:23 AM
వీడియో: SRHలో మరో రోహిత్.. హిట్​మ్యాన్​ను తలపిస్తున్న తెలుగోడు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. సారథిగానూ, ఆటగాడిగానూ ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. బ్యాట్​తో అతడు చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. భారత జట్టు తరఫునే కాదు.. ఐపీఎల్​లోనూ హిట్​మ్యాన్ అవసరమైనప్పుడల్లా విశ్వరూపం చూపిస్తుంటాడు. నీళ్లు తాగినంత అలవోకగా బంతిని స్టాండ్స్​లోకి పంపిస్తుంటాడు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే సిక్సులు కొట్టడం ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. రోహిత్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టులో ఎంత తోపు బౌలర్ ఉన్నా బౌలింగ్ చేయాలంటే చెమటలు పట్టాల్సిందే. అలాంటి హిట్​మ్యాన్​కు వారసుడ్ని తానేనని అంటున్నాడో బ్యాటర్. మరి.. సన్​రైజర్స్ హైదరాబాద్​లో నయా రోహిత్​గా పేరు తెచ్చుకున్న ఆ ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సన్​రైజర్స్​లో మరో రోహిత్ వచ్చేశాడు. అతడే విశాఖపట్నం కుర్రాడు, బ్యాటింగ్ ఆల్​రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ ఐపీఎల్​లో వరుసగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్​లతో దుమ్మురేపుతున్నాడీ తెలుగు తేజం. చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​లో ఆఖర్లో వచ్చి బడా షాట్స్​తో మెరిశాడు నితీష్. విన్నింగ్ షాట్​గా సిక్స్ కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ఆ మ్యాచ్​లో అతడికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు. కానీ అతడి ప్రతిభను గుర్తించిన ఎస్ఆర్​హెచ్ మేనేజ్​మెంట్ పంజాబ్​తో మ్యాచ్​లో ప్రమోషన్ ఇచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్​లో పైకి పంపింది. ఫోర్త్ డౌన్​లో వచ్చిన నితీష్ 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో 4 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. బౌలింగ్​లోనూ తడాఖా చూపించిన ఈ తెలుగు కుర్రాడు కీలక సమయంలో జితేష్ శర్మ (19)ను ఔట్ చేశాడు. అయితే నితీష్ బ్యాటింగ్ అచ్చం రోహిత్ శర్మను తలపించడం హైలైట్ అనే చెప్పాలి.

Another Rohit hitman in SRH, Telugu! 2

రోహిత్ మాదిరిగా ఫస్ట్ బాల్ నుంచే అగ్రెసివ్​గా బ్యాటింగ్ చేస్తున్నాడు నితీష్ రెడ్డి. దొరికిన బాల్​ను దొరికినట్లు బౌండరీకి లేదా స్టాండ్స్​కు పంపిస్తున్నాడు. అతడు కొట్టే సిక్సులకు బంతులు గ్యాలరీల్లో కూర్చున్న ఆడియెన్స్ దగ్గరకు వెళ్లి పడుతున్నాయి. దాన్ని బట్టే అతడి భుజ బలం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పుల్ షాట్స్ కూడా హిట్​మ్యాన్ స్టైల్​లో అలవోకగా బాదేస్తున్నాడీ 20 ఏళ్ల కుర్రాడు. బాల్ కాస్త లెగ్ సైడ్ పడినా పుల్ షాట్​తో విరుచుకుపడుతున్నాడు. బౌన్సర్లను కూడా ఇదే షాట్​తో బౌండరీలుగా మలుస్తున్నాడు నితీష్. దీంతో అందరూ అతడ్ని మరో రోహిత్ అని మెచ్చుకుంటున్నారు. పుల్ షాటే కాదు.. లాఫ్టెడ్ షాట్ కూడా హిట్​మ్యాన్ మాదిరిగానే పర్ఫెక్ట్​గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. రివర్స్ స్వీప్ నితీష్​ అమ్ములపొదిలో మరో అస్త్రంలా మారింది. ఇదే షాట్​తో జడేజా బౌలింగ్​లో సిక్స్ బాదాడతను. ఇదంతా చూస్తున్న నెటిజన్స్.. హిట్​మ్యాన్​కు నితీషే సరైన వారసుడని అంటున్నారు. మరి.. నితీష్ పెర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి