iDreamPost

MS Dhoni: వీడియో: ధోని క్రేజ్ కు మరో మచ్చుతునక.. పాపం రస్సెల్!

మహేంద్రసింగ్ ధోని క్రేజ్ ఎలాంటిదో విండీస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ కు తెలిసొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేంద్రసింగ్ ధోని క్రేజ్ ఎలాంటిదో విండీస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ కు తెలిసొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MS Dhoni: వీడియో: ధోని క్రేజ్ కు మరో మచ్చుతునక.. పాపం రస్సెల్!

ప్రపంచంలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నాగానీ మహేంద్రసింగ్ ధోనికి ఉన్న క్రేజే వేరు. ఇండియాతో పాటుగా వరల్డ్ వైడ్ గా మిస్టర్ కూల్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. కేవలం తన ఆటతీరుతోనే కాక, క్యారెక్టర్ తో ఈ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఐపీఎల్ లో ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం ధోని కోసం మ్యాచ్ చూసేందుకు వచ్చేవారు కోకొల్లలు. అయితే మిస్టర్ కూల్ క్రేజ్ ఎలాంటిదో విండీస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ కు తెలిసొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తాజాగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కేకేఆర్ టీమ్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది చెన్నై. కెప్టెన్ రుతురాజ్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చెన్నై విజయానికి 3 పరుగులు దూరంలో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు దిగాడు మహేంద్రసింగ్ ధోని. అప్పుడు ఒకేసారి గ్రౌండ్ మెుత్తం అరుపులు, ఈలలతో దద్దరిల్లింది.

ఈ క్రమంలోనే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు కేకేఆర్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్. ధోని రాకతో ప్రేక్షకుల అరుపులను తట్టుకోలేకపోయిన ఈ విండీస్ ప్లేయర్ దెబ్బకి రెండు చెవులను మూసుకున్నాడు. అప్పుడు గ్రౌండ్ లో 125 డిసిబల్స్ సౌండ్ వచ్చినట్లు బిగ్ స్క్రీన్ పై చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. ఇది సర్ ధోని రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధోని భారీ సిక్సులే కొట్టనవసరం లేదు.. గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు అభిమానుల మనసులు ఉప్పొంగిపోతాయి అనడానికి ఈ దృశ్యమే ఓ ఉదాహరణ. ఇక మ్యాచ్ అనంతరం ధోనితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెటర్ ధోని అని కితాబిచ్చాడు రస్సెల్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: ఎమర్జెన్సీ సాకుతో ఐపీఎల్ మ్యాచ్ కు.. బాస్ కు తెలిసి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి