Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు అందరి ఫేవరెట్ టీమ్‌గా మారిపోయింది. అంతలోనే ఇంత మార్పుకు కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు అందరి ఫేవరెట్ టీమ్‌గా మారిపోయింది. అంతలోనే ఇంత మార్పుకు కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో ఒకటి. ఒకసారి క్యాష్ రిచ్ లీగ్‌లో విన్నర్‌గా నిలిచిన ఎస్ఆర్హెచ్.. నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. అయితే గత మూడు సీజన్లుగా మాత్రం టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. పాయింట్స్ టేబుల్లో చివర్లో ఉన్న జట్లతో పోటీపడుతూ విమర్శలపాలవుతూ వచ్చింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆటను చూసేందుకు ఎవరూ ఇష్టపడని పరిస్థితి. తెలుగు వాళ్లు తప్ప ఎవరికీ ఎస్ఆర్హెచ్ మ్యాచులపై ఇంట్రెస్ట్ ఉండేది కాదు. జట్టులో బిగ్ స్టార్స్ కూడా లేకపోవడంతో పట్టించుకోవడమే మానేశారు. సన్‌రైజర్స్ మ్యాచ్ వస్తోంది అంటే స్కిప్ చేసే వాళ్లే ఎక్కువయ్యారు. హోమ్ గ్రౌండ్ మ్యాచెస్‌లో కూడా సొంత జట్టుకు కాకుండా ఇతర టీమ్స్‌కు సపోర్ట్ చేసేవాళ్లూ పెరిగారు. కానీ ఒక్క సీజన్ గ్యాప్‌లో ఊహించని మార్పులు వచ్చాయి.
తెలుగు వాళ్లే కాదు.. ఈసారి ఐపీఎల్లో అందరి ఫేవరెట్‌గా మారిపోయింది సన్‌రైజర్స్. మన జట్టు మ్యాచ్ అంటే చాలు.. జనాలు ఎగబడి మరీ చూస్తున్నారు. స్టేడియాలు నిండిపోవడంతో పాటు టీవీల్లో, మొబైల్స్‌లో చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎస్ఆర్హెచ్ మ్యాచులకు కోట్లాది వ్యూస్ వస్తున్నాయి. భారీ అభిమాన గణం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో పోటీపడుతోంది కమిన్స్ సేన. కొన్ని మ్యాచుల్లో ఆ టీమ్స్ కంటే కూడా సన్‌రైజర్స్ మ్యాచులకే మరింత వ్యూస్ వస్తున్నాయి. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. జట్టు ఆటతీరు కంప్లీట్‌గా మారిపోయింది. ఒకప్పుడు ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్‌లు అంటే లోస్కోరింగ్ ఉంటూ బోరింగ్‌గా సాగేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. భారీ స్కోర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది ఎస్ఆర్హెచ్.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఏకంగా 277 పరుగులు చేసింది సన్‌రైజర్స్. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ టీమ్ స్కోర్ కావడం విశేషం. ఒక్క గుజరాత్ మ్యాచ్‌లో తప్పితే మిగతా అన్ని మ్యాచుల్లోనూ కనీసం 180కి పైగా పరుగులే చేసింది ఆరెంజ్ ఆర్మీ. జీటీ మీద 162 రన్స్ మాత్రమే చేయగలిగింది. భారీ స్కోర్లు బాదుతూ ఆడియెన్స్‌కు మస్తు వినోదాన్ని పంచుతున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా సన్‌రైజర్స్ ప్లేయర్లు తమ 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఆడిన 5 మ్యాచుల్లో మూడింట నెగ్గిన మన టీమ్.. మిగతా రెండు మ్యాచుల్లో ఒక దాంట్లో 4 పరుగుల తేడాతో ఓడింది.
టీ20లకు తగ్గట్లు ధనాధన్ బ్యాటింగ్, కళ్లుచెదిరే ఫీల్డింగ్, అద్భుతమైన బౌలింగ్‌తో ఇతర జట్ల అభిమానుల మనసుల్ని కూడా దోచుకుంటున్నారు సన్‌రైజర్స్ ప్లేయర్స్. గ్రౌండ్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆడుతున్నారు. గెలుపైనా, ఓటమైనా మ్యాచ్‌ను లాస్ట్ బాల్ వరకు తీసుకెళ్తున్నారు. ఫియర్లెస్ క్రికెట్‌తో సీఎస్కే, ముంబై లాంటి టాప్ టీమ్స్‌ను చిత్తుగా ఓడించారు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అంటే మిగతా జట్లు కూడా భయపడుతున్నాయి. దీంతో మన టీమ్ మ్యాచుల్ని చూసేందుకు తెలుగువారితో పాటు ఇతరులు కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పంజాబ్ కింగ్స్‌తో వాళ్ల సొంతగడ్డ మీద జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ టీమ్‌కు ఫుల్ సపోర్ట్ లభించింది. స్టేడియంలో సన్‌రైజర్స్ టీషర్ట్స్, జెండాలతో తెగ సందడి చేశారు ఫ్యాన్స్. ఈ స్థాయిలో ఆరెంజ్ ఆర్మీ మ్యాచులకు దక్కుతున్న ఆదరణ, వ్యూస్ చూస్తుంటే ఫ్యాన్ బేస్‌లో ఇతర టీమ్స్‌ను కమిన్స్ సేన అతి త్వరలో దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది.