iDreamPost
android-app
ios-app

వీడియో: CSK vs KKR మ్యాచ్.. ఫ్యాన్స్ ను టీజ్ చేసిన జడేజా! ఇది నెక్ట్స్ లెవల్..

  • Published Apr 09, 2024 | 11:08 AM Updated Updated Apr 09, 2024 | 11:08 AM

కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో ఫ్యాన్స్ ను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు సీఎస్కే స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో ఫ్యాన్స్ ను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేశాడు సీఎస్కే స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Apr 09, 2024 | 11:08 AMUpdated Apr 09, 2024 | 11:08 AM
వీడియో: CSK vs KKR మ్యాచ్.. ఫ్యాన్స్ ను టీజ్ చేసిన జడేజా! ఇది నెక్ట్స్ లెవల్..

ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తూ ముందుకు సాగుతోంది ఈ ఐపీఎల్ సీజన్. కొన్ని మ్యాచ్ ల్లో భారీ స్కోర్లు నమోదు అవుతుంటే.. మరికొన్ని మ్యాచ్ ల్లో తక్కువ పరుగులు నమోదు అవుతున్నాయి. అయినప్పటికీ.. నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్ లు సాగుతున్నాయి. తాజాగా జరిగిన కేకేఆర్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో సైతం తక్కువ పరుగులే నమోదు అయ్యాయి. కానీ ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత వినోదం అందిందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో ఫ్యాన్స్ ను టీజ్ చేశాడు సీఎస్కే స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

రవీంద్ర జడేజా.. తన అద్భుతమైన స్పిన్, అంతకంటే సూపర్ బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్రవేసుకున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కీలకంగా మారాడు. బౌలింగ్, బ్యాటింగ్ తో జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ వేసి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో కేకేఆర్ టీమ్ 137 పరుగులకే పరిమితమైంది.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో తనలో ఉన్న హాస్యచతురతను మరోసారి ప్రపంచానికి చూపించాడు. అసలేం జరిగిందంటే? 138 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై ఆరంభం నుంచే లక్ష్యం దిశగా సాగింది. రచిన్ రవీంద్ర(15), రుతురాజ్ గైక్వాడ్(67*), డార్లి మిచెల్(25), శివమ్ దుబే(28) పరుగులతో రాణించారు. అయితే మరో 3 పరుగులు సాధిస్తే చెన్నై విజయం సాధిస్తుందనంగా.. దుబే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో నెక్ట్స్ బ్యాటర్ గా రవీంద్ర జడేజా గ్రౌండ్ లోకి వస్తున్నాడు. అయితే అక్కడే కూర్చున్న చెన్నై స్టాఫ్ జడ్డూను చూసి షాకైయ్యారు. కానీ వెంటనే జడేజా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. ఆ వెంటనే ధోని గ్రౌండ్ లోకి దిగాడు. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులు గట్టిగా అరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ను భలే టీజ్ చేశావ్ జడ్డూ భాయ్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. నీలో ఇంకా ఆ కామెడీ తగ్గలేదు భయ్యా అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss