iDreamPost

IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్ కు శుభవార్త! 2024 సీజన్ గురించి క్రేజీ న్యూస్!

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సీజన్ కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం పదండి.

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సీజన్ కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం పదండి.

IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్ కు శుభవార్త! 2024 సీజన్ గురించి క్రేజీ న్యూస్!

IPL.. ప్రపంచ క్రికెట్ లో ఒక గొప్ప ఆవిష్కరణ. ఎప్పుడైతే ఈ మెగాటోర్నీ క్రికెట్ లోకి ప్రవేశించిందో.. అప్పటి నుంచి క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. 2008లో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఐపీఎల్, ఇప్పటి వరకు దిగ్విజయంగా 16 సీజన్లను పూర్తి చేసుకుంది. మరికొన్ని నెలల్లో 17వ ఎడిషన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఇటీవలే ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి మినీ వేలం కూడా కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఫ్రాంచైజీలు టైటిల్ ఎలా కొట్టాలి అంటూ ప్రణాళికలను ఇప్పటి నుంచే వేస్తున్నారు. అయితే గతంలో ఐపీఎల్ 2024కు సంబంధించి ఓ న్యూస్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాజాగా ఐపీఎల్ ఫ్యాన్స్ కు ఓ తీపికబురు అందింది.

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే మినీ వేలం కూడా ముగిసింది. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు తమ ఆటగాళ్ల మెరుపులను గ్రౌండ్ లో చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే ఇలాంటి వారికి గతంలో ఓ న్యూస్ నిద్రపట్టనివ్వలేదు. అదేంటంటే? భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా, పోలీసులు మ్యాచ్ లకు భద్రత కల్పించలేరని అందుకే ఈ ఐపీఎల్ సీజన్ ను యూఏఈ లేదా మరే ఇతర దేశాల్లో అయిన నిర్వహించడానికి బీసీసీఐ చర్యలు చేపడుతోందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అన్ని అవాస్తవాలని తెలుస్తోంది.

తాజాగా పలు నివేదికలు చెబుతున్న ప్రకారం.. ఐపీఎల్ 2024 సీజన్ ఇండియాలోనే జరుగుతుందని సమాచారం. మార్చి 22న ప్రారంభం అయ్యి.. మే నెలలో ముగుస్తుందని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఇండియాలోనే ఐపీఎల్ జరుగుతుందని సమాచారం. ఈ మెగాటోర్నీ జరిగే సమయంలోనే జనరల్ ఎలక్షన్స్ ఉండటంతో.. శాంతి భద్రతల విషయం కత్తిమీద సాములా తయ్యారు అయ్యింది. అయితే దీన్ని పోలీసు యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించగలుగుతుందని కొందరు ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీంతో ఐపీఎల్ పక్కాగా ఇండియాలోనే జరుగుతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి