iDreamPost
android-app
ios-app

Rishabh Pant: పంత్​పై వేటు వేసిన BCCI.. ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేయలేదు!

  • Published May 11, 2024 | 3:50 PMUpdated May 11, 2024 | 4:01 PM

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్​పై బీసీసీఐ వేటు వేసింది. బోర్డు అనూహ్య నిర్ణయంతో అంతా షాక్ అవుతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్​పై బీసీసీఐ వేటు వేసింది. బోర్డు అనూహ్య నిర్ణయంతో అంతా షాక్ అవుతున్నారు.

  • Published May 11, 2024 | 3:50 PMUpdated May 11, 2024 | 4:01 PM
Rishabh Pant: పంత్​పై వేటు వేసిన BCCI.. ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేయలేదు!

యాక్సిడెంట్ కారణంగా రెండేళ్ల పాటు క్రికెట్​కు దూరమయ్యాడు రిషబ్ పంత్. ఎంతో టాలెంట్ ఉన్నోడు, టీమిండియా ఫ్యూచర్​గా పేరు తెచ్చుకున్న క్రికెటర్ ఇలా ప్రమాదానికి గురవ్వడం, క్రికెట్​కు దూరమవడంతో అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. అయితే ఆస్పత్రి బెడ్ మీద నుంచి లేస్తాడో లేవడో తెలియని సిచ్యువేషన్ నుంచి రెండేళ్లు గడిచేసరికి తిరిగి క్రికెట్ ఫీల్డ్​లో అదరగొట్టే స్థాయికి చేరుకున్నాడు పంత్. కమ్​బ్యాక్ కోసం నెలల పాటు కఠోరంగా శ్రమించి తన బ్యాటింగ్​ టెక్నిక్​, ఫిట్​నెస్​ను మెరుగుపర్చుకున్నాడు. రీఎంట్రీలో ఐపీఎల్​-2024లో అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా 12 మ్యాచుల్లో 413 పరుగులు చేశాడు. అలాంటోడి మీద బీసీసీఐ వేటు వేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మీద బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్​ కండక్ట్​ను ఉల్లంఘించినందున అతడిపై ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. బ్యాన్​ వేయడమే గాక పంత్​కు రూ.30 లక్షల జరిమానాను కూడా విధించింది. రాజస్థాన్ రాయల్స్​తో మే 7వ తేదీన జరిగిన మ్యాచ్​లో డీసీ టీమ్ ఓవర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్​పై వేటు పడింది. పంత్​తో పాటు మిగతా టీమ్​మేట్స్ మీద కూడా చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ ఆర్గనైజర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం లేదా రూ.12 లక్షలు ఫైన్ కట్టాలని ఆదేశించారు.

స్లో ఓవర్ రేట్​ మెయింటెయిన్ చేశారన్న మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఛాలెంజ్ చేసింది. అయితే ఈ రివ్యూను పున: సమీక్షించిన బీసీసీఐ అంబుడ్స్​మన్.. మ్యాచ్ రిఫరీ డిసిషన్ ఫైనల్ అని స్పష్టం చేశారు. దీంతో పంత్​తో పాటు ఇతర ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ఫీజులో కోత పడింది. రిషబ్​కైతే ఏకంగా మ్యాచ్ బ్యాన్ కూడా వేశారు. ఇది డీసీకి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఎందుకంటే, ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ నెగ్గి తీరాలి. ఆర్సీబీతో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టైమ్​లో మ్యాచ్​కు కెప్టెన్, గెలుపు గుర్రమైన పంత్ దూరం కానుండటంతో ఆ టీమ్ ఎలా ఆడుతుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. మరి.. పంత్​ లేకున్నా డీసీ గెలుస్తుందని భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి