iDreamPost
android-app
ios-app

Sanju Samson: గుజరాత్ పై ఓటమి.. శాంసన్ ఫిక్సింగ్ చేశాడా? చిన్న లాజిక్ ఎలా మిస్సైయ్యాడు?

  • Published Apr 11, 2024 | 12:09 PM Updated Updated Apr 11, 2024 | 12:09 PM

గుజరాత్ పై ఓటమితో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు నెటిజన్లు. ఈ మ్యాచ్ లో సంజూ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్ పై ఓటమితో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు నెటిజన్లు. ఈ మ్యాచ్ లో సంజూ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Sanju Samson: గుజరాత్ పై ఓటమి.. శాంసన్ ఫిక్సింగ్ చేశాడా? చిన్న లాజిక్ ఎలా మిస్సైయ్యాడు?

197 పరుగుల లక్ష్యం.. టీ20ల్లో చిన్న టార్గెట్ ఏమీ కాదు. పైగా చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు సాధించాలి. దీంతో ఎవరైనా గుజరాత్ పై రాజస్తాన్ టీమ్ విజయం సాధిస్తుందని అనుకుంటారు. కానీ ఈ మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించని విధంగా 3 వికెట్ల తేడాతో గుజరాత్ సంచలన విజయం సాధించింది. ఇక్కడి వరకు అంతా తెలిసిన విషయమే. కానీ తాజాగా నెటిజన్లు ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ పై చేస్తున్న సంచలన ఆరోపణలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మ్యాచ్ లో శాంసన్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని వారు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలు రావడానికి ఓ ప్రధాన కారణం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సంజూ శాంసన్.. ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ టీమ్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ పై తొలి ఓటమిని చవిచూసిన రాజస్తాన్ టీమ్ మరిన్ని విమర్శలను ఎదుర్కొంటోంది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోవడంతో.. శాంసన్ కెప్టెన్సీపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అయితే సంజూపై ఈ సంచలన ఆరోపణలు రావడానికి కారణం పెద్దదే. క్రికెట్ నాలెడ్జ్ ఏ కూసింత ఉన్న వ్యక్తికైనా ఈ విషయం సులువుగానే అర్ధమవుతుంది.

Allegations of Gujarat Rajasthan match fixing! Samsons reason

గుజరాత్ విజయానికి చివరి 2 ఓవర్లలో 35 పరుగులు అవసరం. అప్పటికే ఆ టీమ్ 7 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి టైమ్ లో అనుభవం ఉన్న ట్రెంట్ బౌల్ట్ ను కాదని ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ లకు బౌలింగ్ ఇచ్చాడు సంజూ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే? ఈ మ్యాచ్ లో 2 ఓవర్లు వేసిన బౌల్ట్ కేవలం 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ చివర్లో మాత్రం బౌల్ట్ కు బౌలింగ్ ఇవ్వకుండా అనుభవం లేని వారికి బంతి ఇచ్చి.. భారీ మూల్యం చెల్లించుకున్నాడు శాంసన్. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రెండు ఓవర్లు వేసి 8 పరుగులు ఇచ్చిన బౌల్ట్ ను కాదని వారికి ఎలా బౌలింగ్ ఇచ్చాడు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సైయ్యాడు? లేదా కావాలనే ఫిక్సింగ్ చేశాడా? అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు.

ఒక విధంగా క్రికెట్ అభిమానులు వేసే క్వశ్చన్స్ ఆలోచించదగ్గవే. క్రికెట్ గురించి కొద్దో గొప్పో తెలిసిన సగటు అభిమాని కూడా శాంసన్ ప్లేస్ లో కెప్టెన్ గా ఉంటే బౌల్ట్ కే బౌలింగ్ ఇస్తాడు. అలాంటిది ఎంతో అనుభవం ఉన్న సంజూ ఎందుకు ఇలా చేశాడా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అయితే కుల్దీప్ సేన్ 10 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీయడంతో.. ఆ నమ్మకంతోనే అతడికి 19వ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న సంజూ శాంసన్ ఇలా చేయడం నిజంగానే ఫిక్సింగ్ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి శాంసన్ పై వస్తున్న ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.