iDreamPost

RR vs GT: గెలిచే మ్యాచ్ లో RRని ఓడించిన పరాగ్! ఈ కారణం మీ ఊహకందదు!

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో RR ఓడిపోవడానికి ప్రధాన కారణం 76 పరుగులు చేసిన రియాన్ పరాగ్ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మితీరాల్సిందే. ఈ రీజన్ మీరు కూడా ఊహించలేరు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో RR ఓడిపోవడానికి ప్రధాన కారణం 76 పరుగులు చేసిన రియాన్ పరాగ్ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మితీరాల్సిందే. ఈ రీజన్ మీరు కూడా ఊహించలేరు. పూర్తి వివరాల్లోకి వెళితే..

RR vs GT: గెలిచే మ్యాచ్ లో RRని ఓడించిన పరాగ్! ఈ కారణం మీ ఊహకందదు!

ఐపీఎల్ 2024 సీజన్ లో మరో ఉత్కంఠకర మ్యాచ్ నమోదైంది. చివరి బాల్ వరకు నరాలుతెగే టెన్షన్ తో జరిగిన ఈ పోరులో గెలవాల్సిన రాజస్తాన్ టీమ్ చేజేతులా ఓడిపోయింది. దీంతో గుజరాత్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే RR ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ మ్యాచ్ లో 76 పరుగులు చేసిన రియాన్ పరాగ్ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మితీరాల్సిందే. ఈ రీజన్ మీరు కూడా ఊహించలేరు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం పదండి.

రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టీమ్ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం. దీంతో ఇరు జట్లలో టెన్షన్ మెుదలైంది. చివరి ఓవర్ వేయడానికి ఆవేష్ ఖాన్ వచ్చాడు. క్రీజ్ లో రషీద్ ఖాన్-రాహుల్ తెవాటియా ఉన్నారు. ఇక తొలి బంతినే రషీద్ ఖాన్ ఫోర్ గా మిలిచి గెలుపు బాటవేశాడు. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు తీసి నెక్ట్స్ మళ్లీ బౌండరీ బాదాడు. దీంతో సమీకరణాలు 3 బంతుల్లో 5 పరుగులుగా మారాయి. అయితే గుజరాత్ గెలుపు ఈజీ అనుకున్నారు అందరు.

Parag beats RR!

కానీ రాహుల్ రనౌట్ కావడంతో.. రాజస్తాన్ శిబిరంలో గెలుపుపై ఆశలు చిగురించాయి. చివరి రెండు బంతుల్లో 4 రన్స్ అవసరం కాగా.. లాస్ట్ బాల్ ను రషీద్ ఖాన్ బౌండరీ తరలించి గుజరాత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఓవర్ లో మెుత్తం 3 ఫోర్లతో సహా 17 పరుగులు వచ్చాయి. ఇంకేంటి మరి రాజస్తాన్ ఓడిపోవడానికి పరాగ్ కారణం అంటున్నారని మీకు డౌట్ రావొచ్చు. అసలు విషయం ఏంటంటే? 19 ఓవర్ వేసిన కుల్దీప్ సేన్ 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఓవర్ వేసేటప్పుడు బాల్, బాల్ కు కుల్దీప్ దగ్గరి వచ్చి అనవసరంగా సలహాలు ఇవ్వడం మెుదలుపెట్టాడు. అప్పటికే టైమ్ అవుతుండటంతో కెప్టెన్ సంజూ శాంసన్ సైతం హెచ్చరించాడు. కానీ అవేవీ పట్టించుకోకుండా పరాగ్ నిజంగానే ఓవరాక్షన్ చేశాడు.

దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి ఓవర్లో నలుగురు ఫీల్డర్లను మాత్రమే సర్కిల్ అవతల పెట్టాల్సి వచ్చింది. ఇది గుజరాత్ బ్యాటర్లకు స్వేచ్ఛను ఇచ్చినట్లైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గుజరాత్ బ్యాటర్లు బౌండరీలు సాధించి అద్భుత విజయం నమోదు చేశారు. పరాగ్ ఓవరాక్షన్ కారణంగా 5 నిమిషాలు వెనకబడిపోయిన రాజస్తాన్ టీమ్ మ్యాచ్ ను గుజరాత్ కు అప్పగించాల్సి వచ్చింది. బ్యాటింగ్ లో 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 76 రన్స్ చేసిన పరాగ్.. ఈ కారణంతో విలన్ గా మారాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. పరాగ్ తో పాటుగా కెప్టెన్ సంజూ శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ 7 వికెట్లు నష్టపోయి చివరి బంతికి సంచలన విజయాన్ని నమోదు చేసింది. జట్టు విజయంలో సాయి సుదర్శన్(35), కెప్టెన్ శుబ్ మన్ గిల్(72) కీలక పాత్ర పోషించారు. మరి రాజస్తాన్ ఓడిపోవడానికి పరాగ్ ఓవరాక్షనే కారణమంటున్న నెటిజన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి