iDreamPost

RCBతో మ్యాచ్​కు ముందు ముంబై జట్టు​లోకి విధ్వంసక బ్యాటర్.. MIను ఆపడం కష్టమే!

  • Published Apr 11, 2024 | 5:38 PMUpdated Apr 11, 2024 | 5:38 PM

హ్యాట్రిక్ ఓటముల తర్వాత గాడిన పడిన ముంబై ఇండియన్స్ టీమ్​కు గుడ్ న్యూస్. ఆ జట్టులోకి ఓ విధ్వంసక బ్యాటర్ ఎంట్రీ ఇస్తున్నాడు.

హ్యాట్రిక్ ఓటముల తర్వాత గాడిన పడిన ముంబై ఇండియన్స్ టీమ్​కు గుడ్ న్యూస్. ఆ జట్టులోకి ఓ విధ్వంసక బ్యాటర్ ఎంట్రీ ఇస్తున్నాడు.

  • Published Apr 11, 2024 | 5:38 PMUpdated Apr 11, 2024 | 5:38 PM
RCBతో మ్యాచ్​కు ముందు ముంబై జట్టు​లోకి విధ్వంసక బ్యాటర్.. MIను ఆపడం కష్టమే!

ఐపీఎల్-2024 మొదలవడానికి ముందు ఫేవరెట్స్​లో ఒకటిగా ముంబై ఇండియన్స్​ను చెప్పుకున్నారు. కానీ ఆ టీమ్ పేరుకు తగ్గట్లు పెర్ఫార్మ్ చేయలేదు. హ్యాట్రిక్ ఓటములతో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో ఎంఐ పనైపోయిందని అంతా భావించారు. అయితే కమ్​బ్యాక్ ఇవ్వడంలో సాటి అయిన ఆ జట్టు నాలుగో మ్యాచ్​లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మీద 29 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోరుకు సిద్ధం అవుతోంది. వరుస పరాభవాలతో నిరాశలో కూరుకుపోయిన ఆర్సీబీని చిత్తు చేయాలని హార్దిక్ సేన భావిస్తోంది. ఈ తరుణంలో ఆ జట్టుకు అదిరిపోయే న్యూస్. ఆ టీమ్​లోకి విధ్వంసక బ్యాటర్ వచ్చేస్తున్నాడు.

ఆర్సీబీతో మ్యాచ్​కు ముందు ముంబై టీమ్​కు శుభవార్త. ఆ జట్టులోకి ఓ యంగ్ గన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడే హార్విక్ దేశాయ్. విష్ణు వినోద్ స్థానంలో ముంబై జట్టులోకి రానున్నాడు హార్విక్. ఈ పేరును మీరు వినుండరు. కానీ డొమెస్టిక్ క్రికెట్​లో పించ్ హిట్టర్​గా మంచి పేరు తెచ్చుకున్నాడు హార్విక్. ధనాధన్ షాట్లతో బౌలర్లను భయపెట్టడంలో ఈ సౌరాష్ట్ర బ్యాటర్ సిద్ధహస్తుడు. ఇప్పటిదాకా 46 ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లు ఆడిన హార్విక్.. 2,658 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే లిస్ట్​-ఏ క్రికెట్​లో 40 మ్యాచ్​ల్లో 1,341 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు 27 టీ20లు ఆడిన ఈ యంగ్ సెన్సేషన్ 691 రన్స్ చేశాడు.

టీ20ల్లో హార్విక్ బెస్ట్ స్కోరు 104 నాటౌట్. పొట్టి ఫార్మాట్​లో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్​ సెంచరీలు బాదాడతను. టీ20ల్లో 90 ఫోర్లు, 22 భారీ సిక్సర్లు కొట్టాడతను. మంచి ఛాన్స్ వస్తే బిగ్ స్టేజ్​ మీద తన సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడీ యంగ్​స్టర్. ఇప్పుడు ముంబై టీమ్ సరైన టైమ్​కు అతడ్ని తీసుకుంది. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం విధ్వంసక ఇన్నింగ్స్​లతో ముంబైని గెలిపించాలని చూస్తున్నాడు. కాగా, ఆర్సీబీతో మ్యాచ్​కు సిద్ధంగా ఉంది ఎంఐ. గత మ్యాచ్​లో రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్​లో రఫ్ఫాడించారు. బౌలింగ్​లో కొయెట్జీ, బుమ్రా, షెఫర్డ్ రాణించారు. బెంగళూరుతో మ్యాచ్​లో ఆ టీమ్​లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అనూహ్యంగా హార్విక్​కు అవకాశం ఇస్తే మాత్రం అతడు చెలరేగడం పక్కాగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి