iDreamPost

రోహితే అసలైన కెప్టెన్.. సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 23, 2024 | 6:38 PMUpdated Mar 23, 2024 | 6:38 PM

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మే అసలైన కెప్టెన్ అన్నాడు. హిట్​మ్యాన్​ను ఉద్దేశించి రైనా ఇంకేం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మే అసలైన కెప్టెన్ అన్నాడు. హిట్​మ్యాన్​ను ఉద్దేశించి రైనా ఇంకేం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 23, 2024 | 6:38 PMUpdated Mar 23, 2024 | 6:38 PM
రోహితే అసలైన కెప్టెన్.. సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్-2024 గ్రాండ్​గా స్టార్ట్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక తర్వాతి మ్యాచులపై అందరి ఫోకస్ నెలకొంది. ముఖ్యంగా హ్యూజ్ ఫ్యాన్​బేస్ ఉన్న ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం గుజరాత్ టైటాన్స్​తో తొలి మ్యాచ్​లో తాడోపేడో తేల్చుకోనుంది ముంబై. అయితే ఈ మ్యాచ్​లో గెలుపోటముల కంటే కూడా కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పాత సారథి రోహిత్ శర్మ కలసి ముందకెళ్తారా? జట్టు కోసం వాళ్లు ఒక్కటవుతారా? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ తరుణంలో టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముంబైకి అసలైన కెప్టెన్ హిట్​మ్యానే అని అన్నాడు.

ముంబై ఇండియన్స్​కే కాదు.. ఈ సీజన్ ఐపీఎల్​లోని అన్ని జట్లకు రోహితే కెప్టెన్ అని రైనా చెప్పాడు. హిట్​మ్యాన్​కు భారీ అభిమాన గణం ఉందని.. అతడు ఎక్కడ ఆడినా ఎంకరేజ్ చేయడానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలిపాడు. భారత జట్టు సారథి అయిన రోహిత్ ఇటీవలే టెస్టు సిరీస్​లో ఇంగ్లండ్​ను మట్టికరిపించాడని.. నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ మీద అతడు ఫోకస్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ టోర్నీలో ఎవరెవర్ని ఆడించాలని అతడు ఆలోచిస్తూ ఉంటాడని.. ఈ దృష్ట్యా ఈ ఐపీఎల్​లోని 10 జట్లకు రోహితే కెప్టెన్ అని రైనా పేర్కొన్నాడు. కాబట్టి అతడు కెప్టెన్ కాదని చెప్పలేమన్నాడు. వరల్డ్ కప్​కు వెళ్లాలంటే బాగా పెర్ఫార్మ్ చేసి హిట్​మ్యాన్​తో పాటు సెలక్టర్ల దృష్టిలో పడాలని యంగ్ ప్లేయర్లకు రైనా సూచించాడు.

Rohith is the captain for all

‘ఐపీఎల్​లో రోహిత్​కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అతడు ముంబై ఇండియన్స్​కు ప్రస్తుతం కెప్టెన్ కాకపోవచ్చు. కానీ టెక్నికల్​గా చూసుకుంటే ఆ జట్టుకు అతడే సారథి. ముంబైకి మాత్రమే కాదు ఐపీఎల్​లోని అన్ని టీమ్స్​కు హిట్​మ్యానే కెప్టెన్. ఎందుకంటే వరల్డ్ కప్​కు వెళ్లే భారత జట్టులో ఎవరెవరు ఆడాలో రోహిత్ చేతిలోనే ఉంటుంది’ అని రైనా చెప్పుకొచ్చాడు. రైనా వ్యాఖ్యలు హిట్​మ్యాన్ ఫ్యాన్స్​కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. హార్దిక్ ముంబైకి కెప్టెన్ అయితే అయ్యుండొచ్చు గానీ అతడు టీమిండియాలో రోహిత్ కిందే ఆడాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని గుర్తుంచుకొని పాండ్యా కాస్త తగ్గి ఉండాలని అంటున్నారు. హిట్​మ్యానే రియల్ బాస్ అని అంటున్నారు. మరి.. రోహితే అసలైన కెప్టెన్ అంటూ రైనా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి