iDreamPost
android-app
ios-app

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. రిషబ్ పంత్ పై నిషేధం?

  • Published Apr 28, 2024 | 10:47 AM Updated Updated Apr 28, 2024 | 10:47 AM

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు భారీ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంత్ పై నిషేధం విధించే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే?

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు భారీ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంత్ పై నిషేధం విధించే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే?

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్.. రిషబ్ పంత్ పై నిషేధం?

ఐపీఎల్ 2024 సీజన్ లో గొప్పగా పుంజుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో 5వ విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ విజయంతో తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు భారీ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంత్ పై నిషేధం విధించే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే?

శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ 84 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసి విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచింది ముంబై ఇండియన్స్. ఇక ఈ విజయంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది ఢిల్లీ. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు కేకేఆర్ తో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ పై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే?

రిషబ్ పంత్ ఈ సీజన్ లో ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు సార్లు జరిమానాకు గురైయ్యాడు. ఇక నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే తప్పును రిపీట్ చేశాడు. ఈ నేపథ్యంలో పంత్ కు రూ. 30 లక్షలు జరిమానాతో పాటుగా ఓ మ్యాచ్ లో వేటు పడే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై ఇంకా టోర్నీ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే జరిగితే కేకేఆర్ తో మ్యాచ్ కు పంత్ దూరం కావాల్సి ఉంటుంది. మరి వరుసగా జరిమానాల పాలవుతున్న పంత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.