iDreamPost
android-app
ios-app

పంత్​ను మించినోడు లేడు.. అతడి ముందు సంజూ దేనికీ పనికిరాడు: మాజీ క్రికెటర్

  • Published Apr 25, 2024 | 6:58 PM Updated Updated Apr 25, 2024 | 6:58 PM

కమ్​బ్యాక్​లో దుమ్మురేపుతున్నాడు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఐపీఎల్-2024లో సుడిగాలి ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థి జట్లను భయపెతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మాజీ క్రికెటర్ అతడి బ్యాటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పంత్​ను మించినోడు లేడని అన్నాడు.

కమ్​బ్యాక్​లో దుమ్మురేపుతున్నాడు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఐపీఎల్-2024లో సుడిగాలి ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థి జట్లను భయపెతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మాజీ క్రికెటర్ అతడి బ్యాటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పంత్​ను మించినోడు లేడని అన్నాడు.

  • Published Apr 25, 2024 | 6:58 PMUpdated Apr 25, 2024 | 6:58 PM
పంత్​ను మించినోడు లేడు.. అతడి ముందు సంజూ దేనికీ పనికిరాడు: మాజీ క్రికెటర్

ఐపీఎల్-2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ సందడి మొదలవనుంది. జూన్ 2వ తేదీ నుంచి మెగా టోర్నీ హడావుడి షురూ అవుతుంది. పొట్టి వరల్డ్ కప్​లో ఆడే స్క్వాడ్స్​ను అన్ని టీమ్స్ త్వరలో ప్రకటించనున్నాయి. దాదాపుగా చాలా జట్లు దీనిపై క్లారిటీకి వచ్చేశాయి. అయితే భారత టీమ్ సెలక్షన్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీని గురించి ఈ వారం చివర్లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్​తో కలసి బీసీసీఐ అధికారులు, సెలక్టర్లు చర్చిస్తారని తెలుస్తోంది. అయితే టీమ్ సెలక్షన్ అంశంలో అన్నింటి కంటే ఎక్కువగా వికెట్ కీపింగ్ రోల్ గురించే డిస్కషన్ నడుస్తోంది. సెలక్టర్లను కూడా ఇదే అంశం ఇబ్బంది పెడుతోంది. రిషత్ పంత్, సంజూ శాంసన్, దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్ రూపంలో నలుగురు బలమైన కంటెండర్లు దీని కోసం పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వరల్డ్ కప్ టీమ్​లో వికెట్ కీపర్​గా ఎవర్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. రోడ్డు ప్రమాదం తర్వాత కమ్​బ్యాక్​ ఇచ్చిన పంత్​.. ఐపీఎల్​లో అదరగొడుతున్నాడు. సంజూ శాంసన్, దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్ కూడా చెలరేగి ఆడుతున్నారు. అయితే పంత్, సంజూ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పంత్ 342 పరుగులతో టోర్నీలో హయ్యెస్ట్ స్కోరర్స్​లో మూడో స్థానంలో ఉన్నాడు. సంజూ 314 పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు. దీంతో వీళ్లిద్దరిలో ఎవర్ని వెస్టిండీస్​కు తీసుకెళ్తారో చెప్పలేని పరిస్థితి. దీనిపై సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ రియాక్ట్ అయ్యాడు. పంత్​ను మించినోడు లేడని అన్నాడు. అతడి ముందు సంజూ దేనికీ పనికిరాడని చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్​లో ఒకటో నంబర్ నుంచి ఏడో పొజిషన్ వరకు ఎక్కడైనా ఆడే సత్తా పంత్​కు ఉందన్నాడు ఏబీడీ.

rishabh pant and sanjusamson

‘బ్యాటింగ్ ఆర్డర్​లో 1 నుంచి 7వ పొజిషన్ వరకు ఎక్కడైనా రిషబ్ పంత్ ఆడగలడు. డొమెస్టిక్ టాలెంట్ అయిన సంజూ శాంసన్​కు అంత సీన్ లేదు. పంత్​కు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ, మెంటాలిటీ శాంసన్​కు లేదు’ అని డివిలియర్స్ స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్ కప్​ టీమ్​లో పంత్ ఉండాల్సిందేనని ఇన్​డైరెక్ట్​గా ఏబీడీ చెప్పుకొచ్చాడు. పంత్-సంజూను కంపేర్ చేస్తూ సౌతాఫ్రికా దిగ్గజం చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏబీడీ చెప్పింది నిజమని.. సంజూతో పోలిస్తే పంత్ తోపు బ్యాటర్ అని అంటున్నారు. టీ20 క్రికెట్​కు తగ్గట్లు దూకుడుగా ఆడటం, అవసరమైనప్పుడు గేర్లు మార్చడంలో రిషబ్ ఎక్స్​పర్ట్ అని చెబుతున్నారు. అయితే సంజూ గురించి ఏబీడీ మరీ కఠువుగా మాట్లాడాడని, డొమెస్టిక్ టాలెంట్ అనే మాట వాడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, నిన్న గుజరాత్​తో మ్యాచ్​లో 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు పంత్. ఇందులో 5 బౌండరీలతో పాటు 8 భారీ సిక్సలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)