iDreamPost

IPL 2024: రింకూకు మళ్లీ అన్యాయం! పాపం.. భారీగా నష్టపోయాడు!

  • Author singhj Updated - 03:33 PM, Fri - 1 December 23

టీమిండియా యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్​కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే..!

టీమిండియా యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్​కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే..!

  • Author singhj Updated - 03:33 PM, Fri - 1 December 23
IPL 2024: రింకూకు మళ్లీ అన్యాయం! పాపం.. భారీగా నష్టపోయాడు!

రింకూ సింగ్.. ఇండియన్ క్రికెట్​లో ఈ పేరు ఇప్పుడో సెన్సేషన్​గా మారింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఫస్ట్ టీ20లో 14 బంతుల్లో 22 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు రింకూ. 8 వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలవడం కష్టంగా మారింది. అయితే తీవ్ర ఉత్కంఠ మధ్య ఆఖరి వరకు క్రీజులో నిలబడిన రింకూ భారీ షాట్​తో మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ఎంత టెన్షన్ ఉన్నా అతడు కూల్​గా బ్యాటింగ్ చేసి ఫినిషర్ రోల్​ను చక్కగా నిర్వర్తించాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో మ్యాచ్​లోనూ అతడు బాగా ఆడాడు.

సెకండ్ టీ20లో చివర్లో బ్యాటింగ్​కు వచ్చిన రింకూ సింగ్ కేవలం 9 బంతుల్లోనే 31 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్​లో 4 ఫోర్లతో పాటు 2 సిక్సులు ఉన్నాయి. చివర్లో వస్తున్నాడని ఎడాపెడా షాట్లు కొట్టకుండా బాల్ మెరిట్​ను బట్టి ఆడుతున్నాడు రింకూ. బౌలర్ స్లో బాల్ వేస్తున్నాడా? యార్కర్స్ వేస్తున్నాడా? లైన్ అండ్ లెంగ్త్​లో మార్పులు చేస్తున్నాడా? అనేది గమనించి లాస్ట్ మినిట్​ వరకు ఓపిక పట్టి ఏ షాట్ ఆడాలో డిసైడ్ అవుతున్నాడు. అందుకే అతడ్ని ఆపడం బౌలర్ల వల్ల కావడం లేదు. మూడో టీ20లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ దొరకని రింకూ.. మిగిలిన రెండు మ్యాచుల్లో మరోమారు తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు.

బ్యాటింగ్ చేస్తున్న తీరు, ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉండగలడం చూస్తుంటే రింకూ మరో ధోని అవుతాడని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. టీ20లకే కాదు.. వన్డే ఫార్మాట్​లోనూ రెగ్యులర్​గా అతడ్ని ఆడించాలని సూచిస్తున్నారు. మ్యాచులు ఫినిష్ చేసే సత్తా రింకూలో ఉందని, అతడికి ఛాన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్​ ద్వారానే రింకూ నేషనల్ టీమ్​లోకి వచ్చాడనేది తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్​లో కోల్​కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు రింకూ. అదే అతడ్ని ఈ లెవల్​కు తీసుకొచ్చింది.

ఐపీఎల్​, డొమెస్టిక్ లెవల్​తో పాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్​లోనూ సూపర్ ఫామ్​తో అదరగొడుతున్నాడు రింకూ. దీంతో ఈసారి ఐపీఎల్​లో కేకేఆర్ అతడ్ని భారీ ధరకు రిటెయిన్ చేసుకుంటుందని అంతా భావించారు. కానీ కేవలం రూ.80 లక్షలు చెల్లించి అతడ్ని అట్టిపెట్టుకుంది కోల్​కతా. దీంతో రింకూకు తీవ్ర అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అతడు గనుక ఐపీఎల్​ ఆక్షన్​లోకి వస్తే కనీసం రూ.5 కోట్లు నుంచి రూ.7 కోట్లు ఈజీగా దక్కవేని చెబుతున్నారు. రింకూను కేకేఆర్ మోసం చేసిందని.. అతడు భారీగా నష్టపోయాడని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం తనకు లైఫ్ ఇచ్చిన కేకేఆర్​ను వీడటం ఇష్టం లేకే రింకూ ఆ ఫ్రాంచైజీలో ఉండిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రింకూకు అన్యాయం జరిగిందంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్ బోర్డు తిప్పలు.. టీమ్ ఫ్లైట్ ఛార్జీల కోసం పాకులాట!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి