Somesekhar
లక్నో సూపర్ జెయింట్స్ పై మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆర్సీబీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. విరాట్ కోహ్లీకి అది చేతకాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
లక్నో సూపర్ జెయింట్స్ పై మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆర్సీబీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. విరాట్ కోహ్లీకి అది చేతకాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ లో ముచ్చటగా మూడో ఓటమిని మూటగట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఆర్సీబీకి హోం గ్రౌండ్ లో ఇది వరుసగా రెండో పరాజయం. ఇక ఈ మ్యాచ్ లో ఓటమి అనంతరం బెంగళూరు టీమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మనోజ్ తివారీలు ఆర్సీబీ ఓటమిపై స్పందించారు. విరాట్ కోహ్లీకి అది చేతకాదు అంటూ వీరూ భాయ్ కాస్త ఘాటుగానే కామెంట్స్ చేశాడు.
ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోవడం గురించి తొలుత మనోజ్ తివారీ మాట్లాడుతూ..”182 పరుగుల టార్గెట్ ను ఛేదించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది ఆర్సీబీ. ఏబీడీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అదీకాక స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ రాణించాల్సింది. స్టార్ ప్లేయర్లు కనీసం 7-8 మ్యాచ్ లను గెలిపించాలి. మ్యాక్స్ వెల్ ఎంత మంచి ప్లేయరో అతడి ఘనంకాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతడు ఫ్లాప్ అవుతున్నాడు” అని చెప్పుకొచ్చాడు మనోజ్ తివారీ. ఈ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ బదులిచ్చాడు.
“ఓ ప్లేయర్ 7 నుంచి 8 మ్యాచ్ లు గెలిపించాలా? అది విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాదు. ఏ టీమ్ అయినా.. భారీ ధరకు కొనుగోలు చేసిన ప్లేయర్ కనీసం రెండు లేదా మూడు మ్యాచ్ లు గెలిపిస్తే చాలు అనుకుంటారు. అప్పటికే అది గొప్ప. సంవత్సరంలో ఓ ప్లేయర్ 7-8 మ్యాచ్ లు గెలిపించవచ్చు. కానీ ఒక ఐపీఎల్ సీజన్ లో ఇది సాధ్యం కాదు. నేను ఇంత వరకు ఇలా గెలిపించిన ఆటగాడిని ఐపీఎల్ లో చూడలేదు” అని మనోజ్ తివారీ వ్యాఖ్యలకు బదులిచ్చాడు వీరూ భాయ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ వీరేంద్రుడిపై కాస్త గుర్రుగా ఉన్నారు. విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు చూసి కూడా ఇలా అంటున్నారా? మీరు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి సెహ్వాగ్ అన్న మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: వీడియో: సచిన్ను పట్టించుకోని పాండ్యా! రోహిత్ మాత్రం పరుగున వెళ్లి..