iDreamPost
android-app
ios-app

RCB: అతడి రాకతో ఆర్సీబీ ఆటతీరే మారిపోయింది.. డుప్లెసిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 13, 2024 | 12:05 PM Updated Updated May 13, 2024 | 12:05 PM

ఆ ప్లేయర్ రాకతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటతీరు పూర్తిగా మారిపోయిందని అతడిపై ప్రశంసలు కురిపించాడు కెప్టెన్ డుప్లెసిస్. మరి ఆ ఆటగాడు ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఆ ప్లేయర్ రాకతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటతీరు పూర్తిగా మారిపోయిందని అతడిపై ప్రశంసలు కురిపించాడు కెప్టెన్ డుప్లెసిస్. మరి ఆ ఆటగాడు ఎవరు? తెలుసుకుందాం పదండి.

RCB: అతడి రాకతో ఆర్సీబీ ఆటతీరే మారిపోయింది.. డుప్లెసిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 47 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ సీజన్ లో వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది ఆర్సీబీ. ఇక ఢిల్లీపై సాధించిన అద్భుత విజయం తర్వాత ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ ఆటగాడు జట్టులోకి రావడంతోనే ఆర్సీబీ టీమ్ ఆటతీరు మారిపోయిందని చెప్పుకొచ్చాడు. మరి ఆర్సీబీ తలరాతను మార్చిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఢిల్లీపై సూపర్ విక్టరీని నమోదు చేసి తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఆర్సీబీ. ఇక ఈ విజయం అనంతరం మాట్లాడిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డుప్లెసిస్ మాట్లాడుతూ..”ఈ గెలుపు అద్భుతం. మాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. అయితే ఫస్టాఫ్ లో మేము అంతగా రాణించలేకపోయాము. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దారుణంగా విఫలం అయ్యాం. అయితే ఓ ఆటగాడి రాకతో మా టీమ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అతడే స్వప్నిల్ సింగ్. స్వప్నిల్ రాకతో మా బౌలింగ్ బలం పెరిగింది. అతడి స్పిన్ టీమ్ కు ఎంతో ఉపయోగపడుతోంది. స్వప్నిల్ మాకు దొరికిన అదృష్టం”అంటూ ప్రశంసలు కురిపించాడు.

కాగా.. గత రెండు, మూడు మ్యాచ్ ల్లో యశ్ దయాల్, లూకీ ఫెర్గ్యూసన్ అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ కితాబిచ్చాడు డుప్లెసిస్. ఇక ఈ సీజన్ లో మధ్యలో టీమ్ లోకి వచ్చాడు 33 ఏళ్ల స్వప్నిల్ సింగ్. నాలుగు మ్యాచ్ లు ఆడి.. ఐదు వికెట్లు తీశాడు. ఇక ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తొలి ఓవర్ ఇచ్చిన డుప్లెసిస్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఓపెనర్ డేవిడ్ వార్నర్(1)ని 4వ బంతికే అవుట్ చేశాడు. దాంతో ఢిల్లీపై ప్రారంభంలోనే ఒత్తిడి తీసుకొచ్చాడు. మరి స్వప్నిల్ సింగ్ రాకతోనే ఆర్సీబీ ఆటతీరు మారిపోయింది అన్న డుప్లెసిస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.