iDreamPost

RCB vs DC: వీడియో: కోహ్లీకి దండం పెట్టిన అనుష్క శర్మ.. ఎందుకో తెలుసా?

  • Published May 13, 2024 | 11:34 AMUpdated May 13, 2024 | 11:34 AM

పనైపోయింది, ఇక బయటికే అనుకున్న ఆర్సీబీ అందర్నీ తొక్కుకుంటూ పోతోంది. ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తు చేస్తూ ప్లేఆఫ్స్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

పనైపోయింది, ఇక బయటికే అనుకున్న ఆర్సీబీ అందర్నీ తొక్కుకుంటూ పోతోంది. ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తు చేస్తూ ప్లేఆఫ్స్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

  • Published May 13, 2024 | 11:34 AMUpdated May 13, 2024 | 11:34 AM
RCB vs DC: వీడియో: కోహ్లీకి దండం పెట్టిన అనుష్క శర్మ.. ఎందుకో తెలుసా?

పనైపోయింది, ఇక బయటికే అనుకున్న ఆర్సీబీ అందర్నీ తొక్కుకుంటూ పోతోంది. విమర్శించిన వారి నోళ్లు మూయిస్తూ, ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తు చేస్తూ ప్లేఆఫ్స్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో 47 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్లకు 187 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన డీసీ.. 19.1 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. బ్యాటింగ్​లో 32 పరుగులతో సత్తా చాటిన కామెరాన్ గ్రీన్.. బౌలింగ్​లోనూ ఒక వికెట్​తో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ భార్య అనుష్క హైలైట్​గా నిలిచింది.

ఐపీఎల్ ఫస్టాఫ్ టైమ్​లో లండన్​లో ఉన్న అనుష్క శర్మ.. సెకండాఫ్​ సమయానికి భారత్​లో ల్యాండ్ అయింది. ఆర్సీబీ మ్యాచులకు అటెండ్ అవుతూ స్టేడియంలో తెగ సందడి చేస్తోంది. కోహ్లీని ఎంకరేజ్ చేస్తోంది. విరాట్ బ్యాటింగ్ టైమ్​లో, అలాగే ఆర్సీబీ ఫీల్డింగ్ సమయంలోనూ అనుష్క మీద ఎక్కువగా కెమెరాలు ఫోకస్ అవుతున్నాయి. కోహ్లీ ఫోర్లు, సిక్సులు బాదినా.. క్యాచులు పట్టినా ఫుల్​గా సెలబ్రేట్ చేసుకుంటోంది అనుష్క. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో గెలుపును కూడా ఆమె బాగా సెలబ్రేట్ చేసుకుంది. డీసీ ఆఖరి వికెట్ పడగానే ఎగిరి గంతేసింది విరాట్ సతీమణి. నవ్వుతూ, దూకుతూ ఉత్సాహంగా కనిపించింది. ఈ క్రమంలో తన భర్తకు దండం పెట్టింది.

డీసీపై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు సంబురంలో మునిగిపోయారు. ఆ సమయంలో కోహ్లీ మాత్రం తన భార్య వైపు చూశాడు. సాధించానంటూ ఆమె వైపు వేలు చూపిస్తూ సైగ చేశాడు. దాన్ని చూసిన అనుష్క వెంటనే దండం పెట్టేసింది. కింగ్ వైపు చూస్తూ అలాగే నిలబడింది. కోహ్లీ కూడా అనుకున్న పని పూర్తి చేశా, విజయం సాధించానంటూ ఆమె వైపు చూశాడు. దీనికి సంబంధించిన విజువల్స్, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారాయి. ఇక, కోహ్లీ టీమ్ ఇలాగే ఆడి సీఎస్​కేను భారీ తేడాతో ఓడిస్తే ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయిపోతుంది. మరి.. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుతుందని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి