iDreamPost
android-app
ios-app

IPL నుంచి మాక్స్​వెల్ పరార్.. RCB ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

  • Published Apr 13, 2024 | 3:33 PM Updated Updated Apr 13, 2024 | 3:33 PM

ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓటములకు బ్రేక్ పడటం లేదు. వరుస పరాజయలతో ఆ టీమ్ పాయింట్స్ టేబుల్​లో ఆఖరి ప్లేస్​కు పడిపోయింది. స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్​వెల్ ఫెయిల్యూర్​ బెంగళూరును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓటములకు బ్రేక్ పడటం లేదు. వరుస పరాజయలతో ఆ టీమ్ పాయింట్స్ టేబుల్​లో ఆఖరి ప్లేస్​కు పడిపోయింది. స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్​వెల్ ఫెయిల్యూర్​ బెంగళూరును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

  • Published Apr 13, 2024 | 3:33 PMUpdated Apr 13, 2024 | 3:33 PM
IPL నుంచి మాక్స్​వెల్ పరార్.. RCB ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

రూ.14 కోట్లు పెట్టి ఏరి కోరి కొనుక్కున్నారు. ఇతర జట్లతో ఎంత పోటీ ఎదురైనా తగ్గకుండా వేలంలో అతడ్ని సొంతం చేసుకున్నారు. టీమ్​కు అతడు కప్ అందిస్తాడని ఎంతో నమ్మారు. 16 సీజన్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్ ఆశను ఈసారి నెరవేరుస్తాడని భావించారు. జట్టులోని ఇతర ఆటగాళ్ల అండతో మ్యాజిక్ చేస్తాడని అనుకున్నారు. కానీ అతడు ఆశలన్నీ ఆవిరి చేశాడు. ఫ్రాంచైజీతో పాటు కోట్లాది మంది అభిమానుల కలల్ని కల్లలు చేశాడు. మ్యాచ్​లు గెలిపించడం మాట దేవుడెరుగు.. ఓటములకు అతడే ప్రధాన కారణం అవుతున్నాడు. బ్యాట్ పట్టుకోవడమే రాదన్నట్లు ఆడుతున్నాడు. అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నాడు. కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేక ఫ్యాన్స్​ను తీవ్రంగా నిరాశపరుస్తున్న ఆ స్టార్ ప్లేయర్ మరెవరో కాదు.. గ్లెన్ మాక్స్​వెల్. ఆర్సీబీ పాలిట విలన్​గా మారిన ఈ హార్డ్ హిట్టర్ పరార్ అయ్యాడని వినిపిస్తోంది.

కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మాక్స్​వెల్, ఫాఫ్ డుప్లెసిస్) త్రయంలో ఒకడిగా ఉన్నాడు మాక్సీ. ఈ త్రయం తమను గెలిపిస్తుందని, కప్పు ఆశ తీరుస్తుందని ఆర్సీబీ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లు ఆడుతూ విరాట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్​గా ఉన్నాడు. టీమ్ గెలవకపోయినా తన ఆటతీరుతో అందరి మనసుల్ని అతడు దోచుకుంటున్నాడు. డుప్లెసిస్ బ్యాట్​తో ఫర్వాలేదనిపిస్తున్నా, కెప్టెన్సీలో జట్టు విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ త్రయంలోని చివరివాడైన మాక్స్​వెల్ అందర్నీ నిరాశపరుస్తున్నాడు. గత ఆరు మ్యాచుల్లో అతడి బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు 32 మాత్రమే. ఈ ఐపీఎల్​లో అతడి స్కోర్లు 0, 3, 28, 0, 1, 0 ఇలా ఉన్నాయి. గత ఆరు ఇన్నింగ్స్​ల్లో మూడు సార్లు డకౌట్ అయ్యాడు మాక్స్​వెల్. రెండు సార్లు సింగిల్ డిజిట్​కే పరిమితం అయ్యాడు. ఇది బెంగళూరు బ్యాటింగ్​పై, విజయావకాశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

మాక్సీ ఫెయిల్యూర్ వల్ల ఇతర బ్యాటర్ల మీద ఒత్తిడి పెరిగి.. టీమ్ స్కోరు మీద ఎఫెక్ట్ పడుతోంది. ఈ తరుణంలో అతడి గాయం వార్త బయటకు వచ్చింది. బొటనవేలి నొప్పితో బాధపడుతున్న మాక్సీ.. తర్వాతి రెండు మ్యాచ్​లకు దూరం కానున్నాడని సమాచారం. దీనిపై ఆర్సీబీ అభిమానులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మాక్సీ దూరమైంది రెండు టీ20లకే అయినా అతడు ఆడలేకపోతున్నాడు, పరార్ అయ్యాడంటూ సెటైర్లు వేస్తున్నారు. లాస్ట్ ఆరు ఇన్నింగ్స్​లో అతడి ప్రదర్శన చూసి ఈ విధంగా అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. అతడు టోర్నీ నుంచి తప్పుకున్నా ఏం కాదని అంటున్నారు. అయితే నిజానికి మాక్సీ పూర్తిగా దూరం కాలేదు. ఇంజ్యురీ నుంచి కోలుకోగానే అతడు టీమ్​లోకి వచ్చేస్తాడు. ఏదేమైనా మాక్స్​వెల్ బ్యాటింగ్​పై అభిమానులు సీరియస్​గా ఉన్న మాట వాస్తవం. ఆస్ట్రేలియా తరఫున ఇటీవల వన్డే వరల్డ్ కప్​లో కూడా అదరగొట్టిన ప్లేయర్.. ఇప్పుడు ఐపీఎల్​లో దారుణంగా ఫెయిలవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. మరి.. మాక్సీ పెర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş