SNP
IPL 2024, Playoffs: ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ కోసం చాలా టీమ్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే.. ఇంత భారీ పోటీలో కూడా ఓ నాలుగు టీమ్స్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
IPL 2024, Playoffs: ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ కోసం చాలా టీమ్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే.. ఇంత భారీ పోటీలో కూడా ఓ నాలుగు టీమ్స్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024 అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ టీమ్ ఎప్పుడు గెలుస్తుందో, ఏ టీమ్ ఎప్పుడు ఓడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సీజన్ ముగింపు దశకు వచ్చినా.. ఇంకా ఒక్క టీమ్ కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేదు. ఒక్క టీమ్‌కు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోలేదు. అంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఓ నాలుగు టీమ్స్ మధ్య మాత్రం నువ్వానేనా అనే రేంజ్లో పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను ఒక సారి గమనిస్తే.. కోల్కత్తా నైట్ రైడర్స్ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి.. టేబుల్ టాపర్‌గా ఉంది. రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో ఉంది. రెండు టీమ్స్ సేమ్ విజయాలతో ఉన్నా.. రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో కేకేఆర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ రెండు టీమ్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరిపోయినట్లే.. మిగిలి మూడేసి మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధిస్తే.. చాలు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లిపోతాయి. ఇక పోటీ మిగిలింది మిగతా రెండు స్థానాల కోసమే. రెండు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడుతున్నాయి. మరి ఈ నాలుగు టీమ్స్‌లో ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చెన్నై సూపర్ కింగ్స్..
సీఎస్కే ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో 12 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఈ టీమ్‌కు ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లను 10న గుజరాత్ టైటాన్స్‌తో అహ్మాదాబాద్‌లో, 12న రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నైలో, 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. ఒకటి హోం గ్రౌండ్లో రెండు అవే గ్రౌండ్స్‌లో సీఎస్కే ఆడనుంది. ప్లే ఆఫ్స్‌కు తొలి రెండు స్థానాల్లో చేరాలంటే.. సీఎస్కే ఈ మూడు మ్యాచ్‌లను కూడా కచ్చితంగా గెలిచి తీరాలి. రెండు మ్యాచ్‌లు గెలిచినా.. ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. అయితే.. రాజస్థాన్, ఆర్సీబీతో మ్యాచ్‌లు టఫ్‌గా ఉండొచ్చు. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడితే మాత్రం సీఎస్కే ప్లే ఆఫ్‌కు వెళ్లడం కష్టమే.
సన్‌రైజర్స్ హైరదాబాద్..
ఎస్ఆర్హెచ్ కూడా 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో 12 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఈ టీమ్‌కు ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు కూడా ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్‌లోనే ఆడనుంది. అది పెద్ద అడ్వాంటేజ్. మే 8న లక్నో సూపర్ జెయింట్స్‌తో, 16న గుజరాత్ టైటాన్స్‌తో, 19న పంజాబ్ కింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో నేడు(బుధవారం) లక్నోతో జరగబోయే మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు కాస్త టఫ్‌గా మారొచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లే ఆఫ్స్ ఛాన్సులు చాలా మెరుగు అవుతాయి. ఎందుకంటే గుజరాత్, పంజాబ్ టీమ్స్ అంత మంచి ఫామ్‌లో లేవు. ఒక వేళ ఈ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్..
డీస ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఈ టీమ్‌కు ఇంకా 2 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. కచ్చితంగా మిగిలిన మ్యాచ్‌లు గెలిచి తీరాలి. ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇతర టీమ్స్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో.. 12న బెంగళూరులో ఆర్సీబీతో, 14న లక్నో సూపర్ జెయింట్స్‌తో హోం గ్రౌండ్లో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలవాలంటే డీసీ చెమటలు చిందించాల్సిందే. ఎందుకంటే.. ఆర్సీబీ, లక్నో రెండు మంచి ఫామ్‌లో ఉన్నాయి. లక్నో అయితే ప్లే ఆఫ్స్ రేసులో కూడా ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్..
ఎల్ఎస్జీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో 12 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ టీమ్‌కు ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లో నేడు(బుధవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్‌లో మ్యాచ్ ఆడనుంది. మే 14న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఢిల్లీలో ఆడునుంది. చివరి మ్యాచ్‌ను మే 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే లక్నోకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. మూడు మ్యాచ్‌లు కూడా లక్నోకు చాలా టఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే.. మూడు టీమ్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నాయి. ముంబై కూడా ఫామ్‌లోకి వచ్చింది.
పైగా చెప్పుకున్నట్లు.. కేకేఆర్, రాజస్థాన్‌తో పాటు.. సీఎస్కే, ఎస్ఆర్హెచ్, డీసీ, ఎల్ఎస్జీ కూడా పోటీ పడుతున్నాయి. ఈ నాలుగు టీమ్స్‌కు మిగిలి ఉన్నా మ్యాచ్‌లు.. ప్రత్యర్థి జట్లు ఫామ్, మ్యాచ్ జరిగే వేదికలు అన్ని విశ్లేషించి చూస్తే.. సీఎస్కే, ఎస్ఆర్హెచ్కే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. డీసీ, లక్నోకు మాత్రం చాలా కష్టంగా ఉంది. మొత్తంగా కేకేఆర్, ఆర్ఆర్, సీఎస్కే, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. మరి ఏ నాలుగు టీమ్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#IPL2024 #IPLPlayOffs pic.twitter.com/8hWGNrWPoW
— Sayyad Nag Pasha (@nag_pasha) May 8, 2024