iDreamPost
android-app
ios-app

Hardik Pandya: ట్రోలింగ్‌ నుంచి పాండ్యాను బయటపడేసిన నీతా అంబానీ! వాట్‌ ఏ మాస్టర్‌ ప్లాన్‌!

  • Published Apr 08, 2024 | 2:02 PM Updated Updated Apr 08, 2024 | 2:02 PM

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ట్రోలింగ్ నుంచి మాస్టర్ ప్లాన్ తో హార్దిక్ పాండ్యాను బయటపడేసింది నీతా అంబానీ. ఆమె ప్లాన్ కు అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి?

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ట్రోలింగ్ నుంచి మాస్టర్ ప్లాన్ తో హార్దిక్ పాండ్యాను బయటపడేసింది నీతా అంబానీ. ఆమె ప్లాన్ కు అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి?

Hardik Pandya: ట్రోలింగ్‌ నుంచి పాండ్యాను బయటపడేసిన నీతా అంబానీ! వాట్‌ ఏ మాస్టర్‌ ప్లాన్‌!

ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకుని హ్యాట్రిక్ ఓటములకు ఫుల్ స్టాప్ పెట్టింది ముంబై జట్టు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 29 పరుగులు తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ట్రోలింగ్ నుంచి మాస్టర్ ప్లాన్ తో హార్దిక్ పాండ్యాను బయటపడేసింది నీతా అంబానీ. ఆమె ప్లాన్ కు అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎప్పుడైతే నియమించబడ్డాడో.. అప్పటి నుంచి అతడిపై విమర్శలు మెుదలైయ్యాయి. ఇక ఈ విమర్శలు కాస్త ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటములు మూటగట్టుకోవడంతో ఎక్కువైయ్యాయి. ఢిల్లీతో ముందు ముంబై ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ పాండ్యాకు గ్రౌండ్ లో అడుగడుగునా అవమానాలే ఎదురైయ్యాయి. మ్యాచ్ జరుగుతుంటే పాండ్యాను కుక్కతో పోల్చడం, హేళన చేయడం చేశారు ప్రేక్షకులు. కానీ ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మాత్రం ఇవేవీ కనిపించలేదు. దానికి కారణం నీతా అంబానీ అంటే ఎవరైనా నమ్ముతారా? పాండ్యాను ట్రోలింగ్ నుంచి బయటపడేసింది ఆమె. ఎలాగంటే?

ప్రతీ ఐపీఎల్ సీజన్ కు ముంబై ఇండియన్స్ రకరకాల NGO ల నుంచి పిల్లలను ఒక మ్యాచ్ చూసేందుకు తీసుకొస్తుంది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ESA (అందరికి క్రీడలు, విద్యా) అందించడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీతో ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలో జరిగిన మ్యాచ్ కు దాదాపు 20 వేల మంది పిల్లలను తీసుకొచ్చారు. దీంతో స్టేడియం మెుత్తం ఎంఐ కలర్ తో నిండిపోయింది. గ్రౌండ్ లో ఎక్కువ భాగం పిల్లలే ఉండటం.. పైగా వారికి పాండ్యా-రోహిత్ మధ్య కెప్టెన్సీ గొడవ గురించి తెలియకపోవడంతో.. వారు కేరింతలు కొడుతు మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.

అదే పిల్లలకు బదులుగా రోహిత్ ఫ్యాన్స్ లేదా కామన్ పీపుల్ స్టేడియానికి వస్తే.. పాండ్యాను హేళన చేసేవారే. పిల్లలు రావడం ఒకవిధంగా పాండ్యాను ట్రోలింగ్ నుంచి బయటపడేయడమే అని చెప్పాలి. ఇది నీతా అంబానీ వేసిన మాస్టర్ ప్లాన్ గా కొందరు చెప్పుకొస్తున్నారు. కానీ.. ప్రతీ సంవత్సరం రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకు ఒక మ్యాచ్ ను చూపిస్తోంది ముంబై యాజమాన్యం. కాకపోతే.. అది ఇప్పుడు పాండ్యాకు అనుకూలించింది అంతే అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసుకొస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Rohit Sharma: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్! తొలి ఇండియన్ ప్లేయర్ గా..