iDreamPost

తెలుగోల్ల ప్రేమకి దండం పెట్టేసిన రోహిత్ శర్మ! నిన్న లైవ్ లో చూపించని వీడియో!

SRH- MI- Rohit Sharma: హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఘరోంగా ఓటమి పాలైంది. ఎంత పోరాడినా విజయం వరించలేదు. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఫ్యాన్స్ కు రోహిత్ శర్మ థ్యాంక్స్ చెప్పాడు.

SRH- MI- Rohit Sharma: హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఘరోంగా ఓటమి పాలైంది. ఎంత పోరాడినా విజయం వరించలేదు. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఫ్యాన్స్ కు రోహిత్ శర్మ థ్యాంక్స్ చెప్పాడు.

తెలుగోల్ల ప్రేమకి దండం పెట్టేసిన రోహిత్ శర్మ! నిన్న లైవ్ లో చూపించని వీడియో!

ఐపీఎల్ 2024లో ముంబయికి ఇంకా తొలి విజయం దక్కలేదు. ఉప్పల్ లో హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి పోరాడి ఓడింది. ఒకానొక సమయంలో ముంబయి జట్టు విజయం ఖాయంగా కనిపించింది. కానీ, చివరకు హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో చాలానే అద్భుతాలు జరిగాయి. రికార్డుల విషయంలో రెండు టీమ్స్ అద్భుతాలు సృష్టించాయి. అయితే మరోవైపు ఫ్యాన్స్ కూడా ప్లేయర్లకు కొన్ని మర్చిపోలేని స్మృతులను పంచారు. వాటిలో ముఖ్యంగా రోహిత్ శర్మపై ఫ్యాన్స్ చూపించిన అభిమానానికి హిట్ మ్యాన్ ఫిదా అయిపోయాడు. ప్రేక్షకులకు దండం పెడుతూ వెళ్లిపోయాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ని సగటు క్రికెట్ అభిమాని మాత్రమే కాదు.. క్రికెట్ ప్లేయర్లు కూడా ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. ముఖ్యంగా ఇరు జట్లు అత్యద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ ప్రేమను ఆడియన్స్ కూడా ఉంచుకోలేదు. ఆటగాళ్లకే తిరిగి ఇచ్చేశారు. ప్రతి బాల్ కి, ప్రతి షాట్ కి ఆడియన్స్ చీర్ చేసిన విధానం, వాళ్లు చూపించిన జోష్ కి ప్లేయర్లు కూడా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా రోహిత్ శర్మాపై హైదరాబాద్ ఫ్యాన్స్ చూపించిన ప్రేమకు హిట్ ఫ్యాన్ ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో రోహిత్ కి ఇంతి మద్దతా అని అంతా నోరెళ్లబెట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే రోహిత్ నామస్మరణతో ఉప్పల్ స్టేడియం మారుమోగిపోయింది.

ముఖ్యంగా రోహిత్ తరఫున హార్దిక్ పాండ్యాపై రివేంజ్ తీర్చుకున్న విధానం కూడా నెట్టింట వైరల్ అయ్యింది. హార్దిక్ పాండ్యా మైదానంలో ఉండగా.. ఫ్యాన్స్ అంతా రోహిత్ రోహిత్ అంటూ కేకలు వేశారు. అంతేకాకుండా మ్యాచ్ మొత్తంలో ముంబయి ఇండియన్స్, రోహిత్ శర్మకు తమ మద్దతు తెలియజేస్తూనే ఉన్నారు. వాళ్లు మొత్తానికి ఒక మంచి మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు. అయితే తనపై చూపించిన అభిమానానికి హిట్ మ్యాన్ స్టన్ అయిపోయాడు. మైదానం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికీ రోహిత్ శర్మ దండం పెట్టుకుంటూ వెళ్లాడు. వారందరికి సాదరంగా రోహిత్ శర్మ అభివాదం చెప్పాడు. ఈ వీడియో మ్యాచ్ లో కనిపించలేదు. కానీ, ఇప్పుడు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ ఫ్యాన్స్ కి హిట్ మ్యాచ్ చూపించిన అపురూపమైన కృతజ్ఞత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆ తర్వాత కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు ఛేజింగ్ లో తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఛేజింగ్ లో ఇది రికార్డే అయినా.. విజయానికి మాత్రం అక్కరకు రాకుండా పోయింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు నుంచి ముగ్గురు ప్లేయర్లు అర్ధ శతకాలు నమోదు చేశారు. ముంబయి తరఫున తిలక్ వర్మ హాఫ్ సెంచరీ బాదాడు. మరి.. రోహిత్ శర్మ తెలుగు అభిమానులకు అభివాదం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి