iDreamPost

ఇది వేరే లెవెల్.. మలింగను ఇమిటేట్ చేసిన ఇషాన్! వీడియో వైరల్..

ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2024 కోసం ముంబై టీమ్ లో చేరాడు. ప్రాక్టీస్ లో భాగంగా అతడు చేసే సందడి గ్రౌండ్ లో నవ్వులు పూయిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ ఆటగాడు మలింగను అతడి ముందే ఇమిటేట్ చేశాడు.

ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2024 కోసం ముంబై టీమ్ లో చేరాడు. ప్రాక్టీస్ లో భాగంగా అతడు చేసే సందడి గ్రౌండ్ లో నవ్వులు పూయిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ ఆటగాడు మలింగను అతడి ముందే ఇమిటేట్ చేశాడు.

ఇది వేరే లెవెల్.. మలింగను ఇమిటేట్ చేసిన ఇషాన్! వీడియో వైరల్..

ఇషాన్ కిషన్.. పాకెట్ డైనమెట్ గా టీమిండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా తనకు బ్రేక్ కావాలని బీసీసీఐని అడిగిమరి రెస్ట్ తీసుకున్నాడు. కానీ చికిత్స తీసుకోకుండా ధోని, రిషబ్ పంత్ లతో కలిసి దుబాయ్ లో పార్టీల్లో కనిపించడంతో.. బీసీసీఐ ఆగ్రహానికి గురైయ్యాడు. విశ్రాంతి తర్వాత డొమెస్టిక్ క్రికెట్ కుండా మరింత కోపం తెప్పించాడు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తొలగించింది. ప్రస్తుతం ఇషాన్ ఐపీఎల్ కోసం ముంబై టీమ్ లో చేరాడు. ప్రాక్టీస్ లో భాగంగా అతడు చేసే సందడి గ్రౌండ్ లో నవ్వులు పూయిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ ఆటగాడు మలింగను అతడి ముందే ఇమిటేట్ చేశాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు ఖాయం. ఇతర క్రికెటర్లు అనుకరిస్తూ.. అతడు పండించే కామెడీ భలేగా ఉంటుంది. గతంలో విరాట్ కోహ్లీతో పాటుగా మరికొందరి ప్లేయర్లను వారి ముందే ఇమిటేట్ చేశాడు ఇషాన్. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు ఇషాన్. ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ శిబిరంలోకి చేరాడు. ఆటగాళ్లందరూ గ్రౌండ్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇషాన్ లో ఉన్న హాస్యనటుడు నిద్రలేచాడు. మలింగ జుట్టును పోలిన కలర్ విగ్ ను పెట్టుకుని అచ్చం అతనిలాగే బౌలింగ్ యాక్షన్ తో అటూ ఇటూ ఉరుకుతూ బంతులు సంధించాడు.

Ishaan who imitated Malinga!

అయితే ఇదంతా మలింగ ముందే చేయడం గమనార్హం. ఇది చూస్తున్న మలింగ నవ్వాపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఇషాన్ నువ్వు మారలేదయ్యా.. బీసీసీఐ మెుట్టికాయలు వేసినా గానీ, ఆ చిలిపితనం పోలేదు నీలో అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డీవై పాటిల్ కప్ 2024లో బరిలోకి దిగాడు ఇషాన్. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొంటున్నాడు. మరి ఇషాన్ మలింగను ఇమిటేట్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సూర్యకుమార్ ను గుర్తుచేసిన RCB లేడీ బౌలర్.. రివేంజ్ అదిరిందంటున్న ఫ్యాన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి