iDreamPost
android-app
ios-app

అఫీషియల్‌: సూర్య వచ్చేస్తున్నాడు! ఇక ముంబైని ఆపేదెవరు?

  • Published Apr 03, 2024 | 8:57 PM Updated Updated Apr 04, 2024 | 4:43 PM

వరుస ఓటముల్లో ఉన్న ముంబై ఇండియన్స్ కు భారీ శుభవార్త అందింది. దీంతోనైనా టీమ్ విజయాల బాట పడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి?

వరుస ఓటముల్లో ఉన్న ముంబై ఇండియన్స్ కు భారీ శుభవార్త అందింది. దీంతోనైనా టీమ్ విజయాల బాట పడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి?

అఫీషియల్‌: సూర్య వచ్చేస్తున్నాడు! ఇక ముంబైని ఆపేదెవరు?

ఐపీఎల్ 2024లో దురదృష్టకరమైన జట్టు ఏది అంటే చాలా మంది ముంబై ఇండియన్స్ అనే చెబుతారు. ఎందుకంటే? టీమ్ లో స్టార్ ప్లేయర్లు ఉన్నాగానీ ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. వరుస పరాజయాలతో సతమతమవుతోంది ఎంఐ టీమ్. ఇదంతా ఒకెత్తు అయితే.. పాండ్యా కెప్టెన్సీపై వస్తున్న విమర్శలు మరో ఎత్తు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ కు భారీ శుభవార్త అందింది. దీంతోనైన టీమ్ విజయాల బాట పడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి?

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉంది ముంబై ఇండియన్స్. ఆడిన మూడు మ్యాచ్ ల్లో కూడా ఓడిపోయింది. ఇలాంటి టైమ్ లో ముంబైకి ఓ భారీ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఢిల్లీతో ఆదివారం(ఏప్రిల్ 7) ఆడే మ్యాచ్ కు అందుబాటులోకి వస్తున్నాడు. అతడికి ఎన్సీఏ వైద్యులు ఫిట్ నెస్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

MI

మడమ, స్పోర్ట్స్ హెర్నియా సర్జరీల కారణంగా గత కొంత కాలంగా క్రికెట్ కు దూరమైయ్యాడు స్కై. సూర్య లేకపోవడం ముంబై జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ కు సూర్య వందశాతం ఫిట్ గా ఉంటాడని ఎన్సీఏకి చెందిన కీలక అధికారి ఒకరు వెల్లడించాడు. మిస్టర్ 360 రాకతో ముంబై టీమ్ ఇంకా పటిష్టం కానుంది. ఇది ఎంఐ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించే వార్తే. కాగా.. అతడి రాకతో ఓటముల్లో ఉన్న ముంబై.. విజయాల బాట పడుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. మరి సూర్య రాకతో ముంబై గెలుపు బాట పడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: KKR vs DC: ఇషాంత్ శర్మను ఉతికారేసిన సునీల్ నరైన్! ఒకే ఓవర్లో విధ్వంసం..

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetartemisbetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis