iDreamPost
android-app
ios-app

KKR vs DC: ఇషాంత్ శర్మను ఉతికారేసిన సునీల్ నరైన్! ఒకే ఓవర్లో విధ్వంసం..

  • Published Apr 03, 2024 | 8:21 PM Updated Updated Apr 03, 2024 | 8:21 PM

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్. ఇషాంత్ శర్మ వేసిన ఓవర్ లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్. ఇషాంత్ శర్మ వేసిన ఓవర్ లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

KKR vs DC: ఇషాంత్ శర్మను ఉతికారేసిన సునీల్ నరైన్! ఒకే ఓవర్లో విధ్వంసం..

ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆకాశమేహద్దుగా చెలరేగాడు సునీల్ నరైన్. ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడుతూ.. కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీని కంప్లీట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ బౌలర్ అయిన ఇషాంత్ శర్మను ఉతికారేశాడు. అతడు వేసిన 4వ ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. కనికరం లేకుండా బాదాడు నరైన్.

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ ఓపెనర్, స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ చెలరేగిపోతున్నాడు. క్రీజ్ లోకి అడుగుపెట్టిందే లెక్క ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరీ ముఖ్యంగా టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మకు పీడకలను మిగిల్చాడు. ఇషాంత్ వేసిన 4వ ఓవర్ లో సునీల్ నరైన్ వరుసగా 6,6,4,0,6,4 బాది ఈ ఓవర్లో మెుత్తం 26 పరుగులు పిండుకున్నాడు. ఎలాంటి బంతి అన్నది పక్కనపెట్టి బాదుడు మెుదలుపెట్టాడు నరైన్. అతడి విధ్వంసం ధాటికి కేకేఆర్ టీమ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే కేవలం 21 బంతుల్లోనే అర్దశతకాన్ని నమోదు చేసుకున్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మకు చుక్కలు చూపించిన నరైన్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: సచిన్‌ను పట్టించుకోని పాండ్యా! రోహిత్‌ మాత్రం పరుగున వెళ్లి..

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet